Priyanka Gandhi: సెల్ఫీ తెచ్చిన చిక్కులు.. మహిళా కానిస్టేబుల్ పై చర్యలు.. ప్రభుత్వంపై ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు!

|

Oct 20, 2021 | 9:24 PM

ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని 17 రోజుల వ్యవధిలో రెండోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Priyanka Gandhi: సెల్ఫీ తెచ్చిన చిక్కులు.. మహిళా కానిస్టేబుల్ పై చర్యలు.. ప్రభుత్వంపై ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు!
Priyanka Gandhi
Follow us on

Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని 17 రోజుల వ్యవధిలో రెండోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రాలో పోలీసు కస్టడీలో మరణించిన పారిశుధ్య కార్మికుడు అరుణ్ వాల్మీకి కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రియాంక వెళుతున్న సందర్భంలో తాజాగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బాధితుడి బంధువులను కలిసేందుకు ఆగ్రా వెళ్తుండగా, ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేలోని టోల్ ప్లాజా వద్ద ఆపారు. లక్నో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే, రెండున్నర గంటల నిర్బంధం తరువాత, ప్రియాంక ఆగ్రా వెళ్లడానికి అనుమతి పొందారు.

ఇదిలా ఉండగా ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకునే సందర్భంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆమెతో సేల్ఫీ తీసుకుంది. దీంతో యూపీ ప్రభుత్వం ఆ కానిస్టేబుల్ పై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. DCP సెంట్రల్ ఖ్యాతి గార్గ్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తారు. అయితే, ఈ విషయంపై ప్రియాంక స్పందించారు. ”నాతో ఫోటో తీయడం నేరమైతే, నేను కూడా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది” అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ఒక ట్వీట్ చేశారు. అందులో ఆమె కానిస్టేబుల్ తనతో తీసుకుంటున్న సేల్ఫీని ఉంచారు. దానితో పాటు ”ఈ చిత్రంతో యోగి జీ ఎంతగానో కలత చెందారని, ఈ మహిళా పోలీసులపై చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాతో చిత్రాలు తీయడం నేరమైతే, నేను కూడా దానికి శిక్ష అనుభవించాలి, ఈ కష్టపడి పనిచేసే మరియు నమ్మకమైన పోలీసుల కెరీర్‌ను పాడు చేయడం ప్రభుత్వానికి సరిపోదు.” అంటూ ఆమె కామెంట్ రాశారు.

ప్రభుత్వ ఉద్యోగం..10 లక్షల పరిహారం

మరోవైపు, మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, బాధిత కుటుంబానికి రూ .10 లక్షల పరిహారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎస్ఎస్పీ మునిరాజ్ స్వీపర్ అరుణ్ వాల్మీకిని విచారించిన 5 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. వారి పేర్లు ఇన్స్పెక్టర్ ఆనంద్ షాహి, ఎస్ఐ యోగేంద్ర, సిపాయి సత్యం, మహేంద్ర మరియు రూపేష్. అంతకుముందు అక్టోబర్ 3 న, లఖింపూర్ ఖేరీ హింస కేసులో బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, పోలీసులు ప్రియాంకను దాదాపు 30 గంటల పాటు నిర్బంధంలో ఉంచి అరెస్టు చేశారు. అయితే, అదే రోజున ఆమెను విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి: Telegram App: వంద కోట్ల డౌన్‌లోడ్‌లతో దూసుకుపోతున్న టెలిగ్రామ్ యాప్.. పదిహేను రోజుల్లో భారీగా చేరిన యూజర్లు..

Future Tech 2021: భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో ఫ్యూచర్ టెక్ 2021 ఈవెంట్.. ఆన్‌లైన్‌లో మీరూ పాల్గొనవచ్చు ఇలా!

India vs Pakistan: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన దుబాయ్.. కాశ్మీర్‌‌లో మౌలిక సదుపాయాల కోసం భారీ పెట్టుబడులు!