ప్రకృతి సృష్టించిన బీభత్సంతో కేరళ అతలాకుతలం.. అండగా నిలిచిన మోదీ సర్కార్..!

|

Aug 10, 2024 | 11:24 AM

కేరళ రాష్ట్రాన్ని ఊహించని ప్రళయం కారణంగా దేశ మొత్తం అయ్యో పాపం కేరళ అనే రీతిలో అతలాకుతలం చేసింది. చిన్నపాటి నిర్లక్ష్యం వందల సంఖ్యలో మృతులకు కారణమైంది. ప్రకృతి సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన వయనాడ్‌ జిల్లాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు.

ప్రకృతి సృష్టించిన బీభత్సంతో కేరళ అతలాకుతలం.. అండగా నిలిచిన మోదీ సర్కార్..!
Modi On Wayanad
Follow us on

కేరళ రాష్ట్రాన్ని ఊహించని ప్రళయం కారణంగా దేశ మొత్తం అయ్యో పాపం కేరళ అనే రీతిలో అతలాకుతలం చేసింది. చిన్నపాటి నిర్లక్ష్యం వందల సంఖ్యలో మృతులకు కారణమైంది. ప్రకృతి సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన వయనాడ్‌ జిల్లాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. అందులో భాగంగా చూరల్మల, ముండక్కై గ్రామాలను ఆయన సందర్శించారు.

అలాగే పునరావాస కేంద్రాలను సైతం ప్రధాని మోదీ సందర్శించి.. అనంతరం జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలపై ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించారు. జాతీయ విపత్తుగా పరిగణించాలని ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర మంత్రుల బృందం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో వయనాడ్ ఘటనను ప్రధాని మోదీ జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశముంది.

జూలై 30వ తేదీన వయనాడ్‌లో ప్రకృతి విలయం తీవ్ర నష్టం కలిగించింది. కొండచరియలు విరిగిపడటంతో వైత్తిరి తాలూకాలోని ముండక్కై, చూరల్‌మల, అట్టమల గ్రామాలు ప్రభావితమయ్యాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో బురద, రాళ్లతో కూడిన నదీ ప్రవాహం ఊళ్లపై విరుచుకుపడింది. దీంతో పెను ప్రమాదం సంభవించింది. వయనాడ్‌ విపత్తులో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 200 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదు.

ప్రకృతి విపత్తుతో వెంటనే అప్రమత్తమైన నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిస్థితిని సమీక్షించింది. సంఘటన స్థలంలో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ కోసం NDRF, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ వంటి 1200 మందికి పైగా రక్షకులను మోహరించడం ద్వారా వెంటనే చర్యలు చేపట్టింది. వైద్య సహాయం, చికిత్స కోసం డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందితో పాటు 100 కి పైగా అంబులెన్స్‌లను సమకూర్చింది.

విపత్తు సవాలును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటానికి సకాలంలో నిధులు సమకూర్చడం ద్వారా కేంద్రం కేరళకు సహాయం చేస్తోంది. ఏప్రిల్ 1న, కేరళ SDRF ఖాతాలో దాదాపు రూ. 395 కోట్లు ఉన్నాయి. 145.60 కోట్లకు పైగా కొనసాగుతున్న సంవత్సరానికి SDRF సెంట్రల్ వాటా మొదటి విడత జూలై 31న ముందస్తుగా విడుదల చేయడం జరిగింది. గత 5 ఏళ్లలో మొత్తం దాదాపు రూ. 1780 కోట్లు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధిలో SDRFలో కేంద్రం వాటాగా 1200 కోట్ల రూపాయలను మోడీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి తోడు మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లలో రాష్ట్ర విపత్తుల నివారణ నిధికి రూ. 445 కోట్లు విడుదల చేసింది.

విలయానికి చురల్‌మల, ముండక్కై గ్రామాలు శిథిలమైయ్యాయి. నాలుగు గ్రామాలైతే రూపురేఖలే కనిపించని దుస్థితి. విపత్తు జరిగిన రోజు నుంచి దాదాపు 10 రోజుల పాటు ఆర్మీ సహాయక చర్యల్లో పాల్గొంది. వరద విలయంలో ఆర్మీ అసామాన్య కృషి ఎవ్వరూ మరిచిపోలేరు. ముండక్కైకి కృత్రిమ వంతెన నిర్మించిన ఆర్మీ, 150 మంది జవాన్లు 31 గంటల్లో 190 అడుగుల బ్రిడ్జిను నిర్మించారు. ఇది భారీ యంత్రాలు, అంబులెన్స్‌ల కదలికను సులభతరం చేయడంలో కీలకంగా మారింది. విశేషమేమిటంటే, ఈ వంతెన నిర్మాణం కేవలం 71 గంటల్లో పూర్తయింది, ఆర్మీ సహాయక చర్యలు ముగియడంతో తిరుగు ప్రయాణమైన జవాన్లకు వీడ్కోలు పలుకుతూ వయనాడ్ ప్రజలు కన్నీటి పర్యంతం అయ్యారు. విపత్తు సమయంలో తమకు ఎంతో సాయం చేసినందుకు ఆర్మీకి కృతజ్ఞతలు చెప్పారు.

వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (IMCT)ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుంది. కేరళకు సహాయ నిధులు అందించేందుకు కేంద్రం సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. బాధితులకు అన్నివిధాలుగా అండగా నిలిచింది కేంద్ర ప్రభుత్వం. వారి కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. రిలీఫ్‌ సెంటర్లలో ఉన్న వాళ్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వాళ్లందరికి కౌన్సెలింగ్‌ ఇప్పించారు. వీలైనంత త్వరగా పునరావాసం కల్పిస్తామని అధికారులు భరోసా కల్పించారు. కేంద్ర మంత్రి సురేశ్ గోపి దగ్గరుండి పరిస్థితులను పర్యవేక్షించారు. సామాజిక కార్యకర్తలు , స్వచ్చంధ సంస్థలు , సైకాలిజస్ట్‌ల సాయం తీసుకుంటున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడిన చోట.. అడ్వాన్స్ రాడార్స్, డ్రోన్స్, హెవీ మిషన్స్ ఉపయోగిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. చలియార్ నదీ తీరంలో 40 కిలోమీటర్ల మేర సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మలప్పురంలోని నీలాంబర్ ప్రాంతంలో చాలా మృతదేహాలు దొరికాయి. చలియార్ రివర్‌లో 73 మృతదేహాలు, 132 బాడీ పార్ట్స్ గుర్తించారు. దొరికిన మృతదేహాల్లో 37 పురుషులు, 29 మహిళలు, ముగ్గురు బాలురు, 4 బాలికలు ఉన్నారన్నారు మలప్పురం అధికారులు.

NDRF, K-9 డాగ్ స్క్వాడ్, ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్, పోలీసులు, అటవీ, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అణువణువు జల్లెడ పడుతున్నారు. కొండ ప్రాంతాల్లో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని తాళ్ల సాయంతో కిందకు తీసుకొచ్చారు. ఇంకా ఎవరైనా కొండల్లో చిక్కుకున్నారా అని.. డ్రోన్స్ సాయంతో వెతుకుతున్నారు. మరోవైపు.. ఇళ్ల చుట్టూ చేరిన వరద, చెత్తా చెదారాన్ని తొలగించే పనిలో నిమగ్నం అయ్యారు సహాయక సిబ్బంది.

వయనాడ్‌ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ రీసెర్చ్‌ అభిప్రాయపడింది. వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించిందనీ దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వయనాడ్‌ ప్రాంతం ఇప్పుడు వేడిగా, పొడిగా మారిపోయిందని తెలిపింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..