PM Modi: ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ

|

Apr 25, 2024 | 9:58 PM

ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ఫోన్లో మాట్లాడారు. ఇటలీ విమోచన దినోత్సవం సందర్భంగా ఆమెకు భారత్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఇది ఎంతగానో తోర్పడుతుంది. ఇటలీ 79వ విమోచనోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మెలోనీకి ఫోన్ చేశారు. ఇటలీ ప్రజలకు తన తరఫునుంచి శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi: ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
Pm Modi
Follow us on

ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ఫోన్లో మాట్లాడారు. ఇటలీ విమోచన దినోత్సవం సందర్భంగా ఆమెకు భారత్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఇది ఎంతగానో తోర్పడుతుంది. ఇటలీ 79వ విమోచనోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మెలోనీకి ఫోన్ చేశారు. ఇటలీ ప్రజలకు తన తరఫునుంచి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 2024న ఇటలీ పుగ్లియాలో జరిగే G7 సమ్మిట్ ఔట్ రీచ్ సెషన్స్ కు ఆహ్వానం అందించినందుకు ధన్యావాదాలు తెలిపారు. ఇటలీ ప్రెసిడెన్సీలో జరిగే ఈ సమావేశానికి ప్రపంచ దేశాల నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు.

గతంలో భారతదేశంలో నిర్వహించిన G20 సమావేశాల తరహాలోనే ఇది జరగనుంది. ఇటలీ ప్రెసిడెన్సీలో జరిగే G7 సమావేశాలు గ్లోబల్ సౌత్ కు ఎంతగానో మద్దతు ఇస్తుందని, చాలా ప్రయోజనం చేకూరుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై ఫోన్లో చర్చించినట్లు సమాచారం. ఇరుదేశాల మధ్య ఉన్న మైత్రీ బంధాన్ని, భాగస్వామ్య బలోపేతానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని పునరుద్ఘాటించారు. ఇరువురు నేతలు ప్రాంతీయ అంశాల గురించే కాకుండా ప్రపంచంలోని వివిధ పరిణామాలపై కూడా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నరు. దీనిపై మోదీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..