PM Modi: బైడెన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌.. ఉక్రెయిన్‌, బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై చర్చ

|

Aug 26, 2024 | 11:04 PM

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్‌ మాట్లాడినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితులు సహా ఆయా ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై సమగ్రంగా చర్చించినట్లు ఎక్స్‌ వేదికగా తెలిపారు. భారతదేశం-అమెరికా భాగస్వామ్యం పట్ల అధ్యక్షుడు బైడెన్‌ నిబద్ధతను ప్రధాని మోదీ ప్రశంసించారు...

PM Modi: బైడెన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌.. ఉక్రెయిన్‌, బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై చర్చ
Follow us on

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్‌ మాట్లాడినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితులు సహా ఆయా ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై సమగ్రంగా చర్చించినట్లు ఎక్స్‌ వేదికగా తెలిపారు. భారతదేశం-అమెరికా భాగస్వామ్యం పట్ల అధ్యక్షుడు బైడెన్‌ నిబద్ధతను ప్రధాని మోదీ ప్రశంసించారు. భారత్-అమెరికా భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజలతో పాటు మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ఉందని ఇరువురు నేతలు హైలైట్ చేశారు. అలాగే ఉక్రెయిన్‌లో పరిస్థితితో సహా వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించారు. తన ఇటీవలి ఉక్రెయిన్ పర్యటన గురించి కూడా ప్రధాన మంత్రి అధ్యక్షుడు బైడెన్‌కు తెలియజేశారు. యుద్ధభూమిలో ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనాలని, వీలైనంత త్వరగా స్థిరత్వం, శాంతిస్థాపన దిశగా భారత్‌ తరఫున పూర్తి మద్దతును పునరుద్ఘాటించినట్లు చెప్పారు.

శాంతి, సుస్థిరత త్వరగా తిరిగి రావడానికి భారతదేశం పూర్తి మద్దతును ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. అలాగే బంగ్లాదేశ్‌ పరిస్థితుల గురించిపై ప్రస్తావన వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. బంగ్లాదేశ్‌ పరిస్థితిపై ఇరువురు నేతలు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా హిందువుల భద్రత, త్వరగా సాధారణ స్థితిని నెలకొల్పాల్సిన అవసరాన్ని చాటిచెప్పినట్లు తెలిపారు. క్వాడ్‌తో సహా బహుపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తన నిబద్ధతను పునరుద్ఘాటించారు మోదీ.

 


ప్రజాస్వామ్యం భాగస్వామ్య విలువలు, చట్టబద్ధమైన పాలన, ప్రజల మధ్య బలమైన సంబంధాలపై ఆధారపడిన భారతదేశం-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి  బైడెన్‌ నిబద్ధతను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించి పీఎంవో నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ద్వైపాక్షిక సంబంధాలలో సాధించిన గణనీయమైన పురోగతి గురించి చర్చించినట్లు పీఎంవో తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి