సీఏఏ వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన నిరసనల టెంటుపై పెట్రో బాంబ్స్..!

| Edited By: Pardhasaradhi Peri

Mar 23, 2020 | 3:27 PM

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనాతో వణికిపోతూ.. జనతా కర్ఫ్యూ చేపట్టిన సమయంలో.. ఢిల్లీలో మాత్రం అందుకు విరుద్ధంగా సీఏఏ వ్యతిరేకి నిరసనలు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలయా యూనివర్సిటీ వద్ద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో పెట్రోల్ బాంబు వేశాడు. అంతేకాదు.. పలు రౌండ్లు కాల్పులు కూడా జరిపాడు. ఈ ఘటన యూనివర్సిటీకి సంబంధించిన ఏడో నంబరు గేట్ వద్ద […]

సీఏఏ వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన నిరసనల టెంటుపై పెట్రో బాంబ్స్..!
Follow us on

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనాతో వణికిపోతూ.. జనతా కర్ఫ్యూ చేపట్టిన సమయంలో.. ఢిల్లీలో మాత్రం అందుకు విరుద్ధంగా సీఏఏ వ్యతిరేకి నిరసనలు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలయా యూనివర్సిటీ వద్ద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో పెట్రోల్ బాంబు వేశాడు. అంతేకాదు.. పలు రౌండ్లు కాల్పులు కూడా జరిపాడు. ఈ ఘటన యూనివర్సిటీకి సంబంధించిన ఏడో నంబరు గేట్ వద్ద చోటు చేసుకుంది. దీంతో జామియా కో ఆర్డినేషన్ కమిటీ పెట్రో బాంబు దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుటుండటంతో.. ప్రస్తుతం నిరసనల కోసం వేసిన టెంట్లలో నిరసనకారులు ఎవరూ కూర్చోవడం లేదని తెలుస్తోంది. కానీ కొంతమంది నిర్వాహకులు మాత్రం అక్కడే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

కాగా.. ఇటీవల చెన్నైలో కూడా రాత్రి సమయంలో ఒకేసారి 5000 మంది సీఏఏని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు.దీనిపై స్థానికుల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఓ వైపు కరోనా టెన్షన్ ఉన్న సమయంలో ఇలాంటి నిరసనలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.