మరోసారి పెరిగిన చమురు ధరలు.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న ‘పెట్రో’ మంట.. హైదరాబాద్‌లో ఎంతంటే..?

Petrol Diesel Prices: దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర చేరుకోగా..

మరోసారి పెరిగిన చమురు ధరలు.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పెట్రో మంట.. హైదరాబాద్‌లో ఎంతంటే..?

Updated on: Jan 26, 2021 | 10:03 AM

Petrol Diesel Prices: దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు చొప్పున పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.51కి చేరుకోగా.. లీటర్ డీజిల్ రూ. 83. 19గా ఉంది. ఇక వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.06 కాగా డీజీల్‌ 82.75గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 91.88 ఉండగా డీజీల్‌ రూ. 85.09గా నమోదైంది. గుంటూరులో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ. 92.09 కాగా.. డీజీల్‌ ధర రూ. 85.26గా ఉంది. అటు విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.10 కాగా.. డీజిల్ రూ. 84.31కు చేరింది.

అటు దేశ రాజధాని ఢిల్లీకి లీటర్ పెట్రోల్ ధర 86.05కి చేరింది. డీజిల్ ధర రూ. 76.23కి పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రల్‌ ధర రూ. 92.62 ఉండగా డీజీల్‌ రూ. 83.03గా ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 88.60 ఉండగా డీజీల్‌ ధర రూ. 81.47గా ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us