కారుతో ఓ వ్యక్తి హల్‎చల్.. అసలు విషయం ఇదే అంటున్న పోలీసులు..

| Edited By: Srikar T

Aug 21, 2024 | 12:09 AM

మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌- అంబర్‌నాథ్‌ రోడ్డులో ఓ వ్యక్తి కారుతో హల్‌చల్‌ చేశాడు. ఒక కారు తన కారును ఢీకొట్టిందని వెళ్తూ వెళ్తూ యూటర్న్‌ తీసుకుని వేగంగా వచ్చి కారును ఢీకొట్టి అరకిలో మీటర్‌ వరకు లాక్కెళ్లాడు. మధ్యలో అడ్డొచ్చిన బైక్‌లను, మనుషులను ఢీకొట్టడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కారుతో ఓ వ్యక్తి హల్‎చల్.. అసలు విషయం ఇదే అంటున్న పోలీసులు..
Maharastra
Follow us on

మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌- అంబర్‌నాథ్‌ రోడ్డులో ఓ వ్యక్తి కారుతో హల్‌చల్‌ చేశాడు. ఒక కారు తన కారును ఢీకొట్టిందని వెళ్తూ వెళ్తూ యూటర్న్‌ తీసుకుని వేగంగా వచ్చి కారును ఢీకొట్టి అరకిలో మీటర్‌ వరకు లాక్కెళ్లాడు. మధ్యలో అడ్డొచ్చిన బైక్‌లను, మనుషులను ఢీకొట్టడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని కారుతో తొక్కించబోతుండగా ఓ వ్యక్తి వెంటనే రక్షించాడు. ఇది ఒక రకంగా హిట్‌ అండ్‌ రన్‌ కేసులా కనిపిస్తున్నా.. ఇదంతా కావాలనే జరిగిన గొడవగా పోలీసులు చెబుతున్నారు.

రెండు కార్లలోని వారు ఒకే కుటుంబానికి చెందినవారని, ఎప్పటి నుంచో పాత కక్షలు ఉన్నాయంటున్నారు. షాకింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముందుగా వెళ్తున్న నల్ల కారును మొదట తెల్లకారు కొంచెం ఢీకొనడంతో ఆగ్రహంతో యూటర్న్‌ తీసుకుని వచ్చి మరీ కారును ఢీకొట్టాడని స్థానికులు అంటున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న స్థానికులు ఆగ్రహంతో కారుపై రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో కారు ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు, క్షతగాత్రులను ఆస్పత్రులకు స్థానికులు తరలించారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..