మతం పేరుతో దేశాన్ని విభజించింది కాంగ్రెస్సే..

| Edited By:

Dec 09, 2019 | 8:30 PM

కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీనే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు చ‌ర్చ సంద‌ర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం లేదని.. ఇది మైనార్టీలకు వ్యతిరేకం కాదన్నారు. మతం పేరుతో దేశాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించకుంటే.. ఇవాళ ఇలాంటి పౌరసత్వ బిల్లు తీసుకురావాల్సిన అవసరం వచ్చేది […]

మతం పేరుతో దేశాన్ని విభజించింది కాంగ్రెస్సే..
Follow us on

కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీనే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు చ‌ర్చ సంద‌ర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం లేదని.. ఇది మైనార్టీలకు వ్యతిరేకం కాదన్నారు. మతం పేరుతో దేశాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించకుంటే.. ఇవాళ ఇలాంటి పౌరసత్వ బిల్లు తీసుకురావాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు.

ఇదిలా ఉంటే పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు ఆర్టిక‌ల్ 11, ఆర్టిక‌ల్ 14ల‌ను ఉల్లంఘిస్తోంద‌ంటూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అమిత్ షా మాత్రం విపక్షాల ఆరోపణలను కొట్టిపారేశారు. గతంలో ఇందిరా ప్రభుత్వం.. 1971 త‌ర్వాత బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చిన వారికి ఎలా పౌర‌స‌త్వాన్ని క‌ల్పించారో కేంద్ర మంత్రి వివరించారు. అదేసమయంలో పాకిస్థాన్ వారికి ఎందుకు అర్హత కల్పించలేదంటూ విపక్షాలను ప్రశ్నించారు. అంతేకాదు.. ఉగాండా నుంచి వలస వచ్చిన వారికి గత ప్రభుత్వాలు పౌర‌స‌త్వం క‌ల్పించాయ‌ని గుర్తు చేశారు.

రిజర్వేషన్లు కల్పించినప్పుడు.. ఆర్టికల్ 14 గుర్తులేదా అంటూ విపక్షాలపై ఫైర్ అయ్యారు. దేశ విభజన సమయంలో భారత్, పాక్ మైనార్టీల రక్షణ కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని.. అదే సమయంలో పాక్, బంగ్లా, ఆఫ్ఘన్ ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నాయన్నారు.

కాగా, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లుపై లోక్‌సభలో సోమవారం హాట్‌హాట్‌గ చర్చ జరిగింది. చర్చ అనంతరం.. బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ఓటింగ్‌ నిర్వహించారు. సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 293 ఓట్లు రాగా, 82 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. ఓటింగ్‌ తర్వాత లోక్‌సభలో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.