జూన్ 3న పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశం

|

May 28, 2020 | 1:07 PM

లాక్‌డౌన్ వల్ల నిలిచిపోయిన పార్లమెంటు కార్యకలాపాలు జూన్ 3న తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కీలక సమావేశం జూన్ 3వతేదీన పార్లమెంటు హౌస్ లో నిర్వహించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్‌ 4.0లో విమాన, రైలు ప్రయాణాలు తిరిగి ప్రారంభమవడంతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడులతో స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నారు. రెండు నెలల లాక్ డౌన్ తర్వాత మొదటిసారి […]

జూన్ 3న పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశం
Follow us on

లాక్‌డౌన్ వల్ల నిలిచిపోయిన పార్లమెంటు కార్యకలాపాలు జూన్ 3న తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కీలక సమావేశం జూన్ 3వతేదీన పార్లమెంటు హౌస్ లో నిర్వహించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్‌ 4.0లో విమాన, రైలు ప్రయాణాలు తిరిగి ప్రారంభమవడంతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడులతో స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నారు. రెండు నెలల లాక్ డౌన్ తర్వాత మొదటిసారి పార్లమెంటు సభ్యులు స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, దేశవ్యాప్త లాక్ డౌన్ పరిస్థితులపై హోంమంత్రిత్వశాఖ అధికారులు స్టాండింగ్ కమిటీకి నివేదించనున్నారు. డిపార్ట్‌మెంట్‌ సంబంధిత స్టాండింగ్‌ కమిటీలలో 31 మంది ఎంపిలు, లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుండి 10 మంది ఉన్నారు.

ఆకస్మికంగా లాక్ డౌన్ విధించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న 8 కోట్ల మంది వలసకార్మికులు పడిన కష్టనష్టాల గురించి స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రశ్నిస్తామని ప్రతిపక్ష సభ్యులు అంటున్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల నిలిచిపోయిన 18 రాజ్యసభ సభ్యుల ఎన్నిక చేపట్టే విషయాన్ని చర్చించనున్నారు.