Shabnam case: నా తల్లికి క్షమాభిక్ష పెట్టండి’ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి షబ్నమ్ కుమారుడి అభ్యర్థన

| Edited By: Pardhasaradhi Peri

Feb 18, 2021 | 12:43 PM

Shabnam case: తన కుటుంబంలో ఏడుగురు సభ్యులను దారుణంగా హతమార్చిన కేసులో దోషి షబ్నమ్ ను  మధుర జైల్లో ఉరి తీసేందుకు సన్నాహాలు జరుగుతుండగా ఆమె కుమారుడు తాజ్..

Shabnam case: నా తల్లికి క్షమాభిక్ష పెట్టండి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి షబ్నమ్ కుమారుడి అభ్యర్థన
Follow us on

Shabnam case: తన కుటుంబంలో ఏడుగురు సభ్యులను దారుణంగా హతమార్చిన కేసులో దోషి షబ్నమ్ ను  మధుర జైల్లో ఉరి తీసేందుకు సన్నాహాలు జరుగుతుండగా ఆమె కుమారుడు తాజ్.. తన తల్లికి క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి లేఖ రాశాడు. ఈ మైనర్ బాలుడు భావోద్వేగంతో ఈ లేఖ పంపడం విశేషం. ఆమె చేసిన దారుణానికి క్షమించాలని, మరణ శిక్షను రద్దు చేయాలని అతడు కోరాడు. మధుర జైల్లో షబ్నమ్ ఉరితీతకు సంబంధించి డెత్ వారంట్ పై రాష్ట్రపతి సంతకం చేయడం మాత్రమే మిగిలి ఉంది. రామ్ పూర్ జైల్లో ఉన్న తన తల్లిని చూసేందుకు తాజ్ తరచూ అక్కడికి వెళ్తుండేవాడు. 2008 లో జరిగిన అమోరహా మర్డర్ కేసు అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించింది. తన తల్లి తనను ఎంతో ప్రేమించేదని, తను జైలుకు ఎప్పుడు వెళ్లినా ఏదైనా కొనుక్కోవాలని డబ్బులిచ్ఛేదని తాజ్ తెలిపాడు. షబ్నమ్ కి ఒకే ఒక్క కొడుకైన ఈ బాలుడు ప్రస్తుతం బులంద్ షహర్ లోని తన కస్టోడియన్ ఉస్మాన్ సైఫి ఇంట్లో నివసిస్తున్నాడు.

మా అమ్మ ప్రేమను నాకు దూరం చేయకండి అని తాజ్ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. జైల్లోనే పుట్టిన తాజ్ ను అతని ఆరేళ్ళ వయస్సులో జైలు అధికారులు ఇతని గార్డియన్ అయిన ఉస్మాన్ సైఫికి అప్పగించారు. షబ్నమ్ తల్లికి చాలా ఆస్తులు ఉన్నాయని, వాటిని ఆమె స్కూళ్ళు, కాలేజీలు, ఆస్పత్రుల వంటి వాటికి దానంగా ఇవ్వవచ్చునని ఉస్మాన్ భార్య వందనా సింగ్ తెలిపింది. తాజ్ ను తాము దత్తత తీసుకున్నామని, మొదట్లో తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా చివరకు ఈ బాలుడు తమకు మాలిమి అయ్యాడని టీచర్ గా పని చేస్తున్న ఆమె వెల్లడించింది.

ఇలా ఉండగా షబ్నమ్ ను ఉరి తీసేందుకు మీరట్ లోని తలారి పవన్ జలాద్ అప్పుడే మధురలో గల  ఒకేఒక మహిళా జైలు సెంటర్ కు చేరుకున్నాడు. ఉరికి అవసరమైన తాళ్ల కోసం ఈ సెంటర్ అధికారులు ఆర్డర్ చేశారని తెలిసింది.

Also Read:

న్యాయవాదుల హత్య కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. ఎఫ్‌ఐఆర్‌లో ఆ ముగ్గురి పేర్లు నమోదు చేసిన పోలీసులు

IPL 2021 Auction: ఆ ఇద్దరు ఆటగాళ్లే ముంబై ఇండియన్స్ టార్గెట్.. అర్జున్ టెండూల్కర్ ను సైతం దక్కించుకునే అవకాశం!