ప్రేమ పేరుతో పాక్ ఉగ్ర ఉచ్చు.. రైల్వే ట్రాక్ పేలుడు కేసులో సంచలనం!

రైల్వే ట్రాక్ పేలుడు కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ప్రేమ, డబ్బు ఆశ చూపి సోషల్ మీడియా ద్వారా యువతులను, ముఖ్యంగా ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్న పాకిస్థాన్ ఏజెంట్ల కుట్ర బయటపడింది. ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుని, ఆ తర్వాత వారిని ఉగ్ర కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

ప్రేమ పేరుతో పాక్ ఉగ్ర ఉచ్చు.. రైల్వే ట్రాక్ పేలుడు కేసులో సంచలనం!
Rajasthan Railway Track Blast Case

Updated on: Nov 15, 2026 | 12:12 PM

రైల్వే ట్రాక్ పేలుడు కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ప్రేమ, డబ్బు ఆశ చూపి సోషల్ మీడియా ద్వారా యువతులను, ముఖ్యంగా ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్న పాకిస్థాన్ ఏజెంట్ల కుట్ర బయటపడింది. ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుని, ఆ తర్వాత వారిని ఉగ్ర కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ రైల్వే ట్రాక్ పేలుడు ఘటనలో ఇద్దరి అరెస్టుతో ఈ కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది.

సోషల్ మీడియా పరిచయం.. ఉగ్ర కార్యకలాపాలకు ప్రేరేపణ!

వివరాల్లోకి వెళితే.. నవంబర్ 3న రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ రైల్వే లైన్‌పై పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాజస్థాన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), పంజాబ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల మెహక్‌దీప్ కౌర్, 23 ఏళ్ల దవీందర్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మెహక్‌దీప్ కౌర్ ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తున్నారు.

పాక్ ఏజెంట్లతో సోషల్ మీడియా పరిచయం!

పోలీసుల విచారణలో షా, చాచా అనే పేర్లతో పరిచయమైన ఇద్దరు పాకిస్థాన్ ఏజెంట్ల పాత్ర వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికగా నిందితులతో పరిచయం పెంచుకున్న వారు ప్రేమ వ్యవహారాలు, డబ్బు ఆశ చూపి వారిని తమ వలలోకి లాగినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అనంతరం రైల్వే ట్రాక్ పేలుడు కుట్రకు వారిని ఉపయోగించుకున్నట్లు అనుమానిస్తున్నారు.

పేలుడు కోసం రూ.30 వేల ఫండింగ్!

ఈ పేలుడు ఘటనకు సంబంధించి పాక్ ఏజెంట్లు నిందితులకు సుమారు రూ.30 వేల నగదు అందించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా గతంలోనూ రెండుసార్లు ఇలాంటి పేలుళ్లకు ప్రయత్నించి విఫలమైనట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఒంటరి మహిళలే టార్గెట్.. భద్రతా సంస్థల అలర్ట్!

ఈ ఘటనతో పాకిస్థాన్ గూఢచార సంస్థలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రేమ, ఆర్థిక ప్రయోజనాలు, వ్యక్తిగత పరిచయాలను అస్త్రాలుగా మార్చుకుని వారిని దేశ వ్యతిరేక కార్యకలాపాల్లోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నట్లు భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ కేసులో పాకిస్థాన్ ఏజెంట్ల పాత్ర, ఆర్థిక లావాదేవీలు, ఇతర వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? మరెన్ని ప్రాంతాల్లో ఇలాంటి నెట్‌వర్క్ పనిచేస్తోంది? అనే కోణాల్లో అధికారులు విచారణ ముమ్మరం చేశారు. రైల్వే భద్రతకు ముప్పుగా మారిన ఈ ఘటన దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us