నిఘా వర్గాల హెచ్చరికలు.. ఎయిర్‌బేస్‌ల వద్ద ఆరెంజ్ అలర్ట్

| Edited By:

Oct 17, 2019 | 12:52 PM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్, భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. అయితే ఏలాగైనా భారత్‌లో అలజడి సృష్టించాలనుకుంటున్న పాక్.. అనేక కుట్రలు పన్నుతోంది. సరిహద్దుల్లో నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో సరిహద్దుల వద్ద హైఅలర్ట్ కొనసాగుతూనే ఉంది. అయితే సరిహద్దుల వెంట డ్రోన్లతో కూడా దాడులు చేసేందుకు పాక్ కుట్రలు పన్నుతోంది. ఇటీవల పంజాబ్, గుజరాత్ సరిహద్దుల్లో వీటి […]

నిఘా వర్గాల హెచ్చరికలు.. ఎయిర్‌బేస్‌ల వద్ద ఆరెంజ్ అలర్ట్
Follow us on

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్, భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. అయితే ఏలాగైనా భారత్‌లో అలజడి సృష్టించాలనుకుంటున్న పాక్.. అనేక కుట్రలు పన్నుతోంది. సరిహద్దుల్లో నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో సరిహద్దుల వద్ద హైఅలర్ట్ కొనసాగుతూనే ఉంది. అయితే సరిహద్దుల వెంట డ్రోన్లతో కూడా దాడులు చేసేందుకు పాక్ కుట్రలు పన్నుతోంది. ఇటీవల పంజాబ్, గుజరాత్ సరిహద్దుల్లో వీటి ఉనికిని కూడా గుర్తించారు బీఎస్ఎఫ్. అయితే తాజగా రక్షణ స్థావరాలపై కూడా దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు ప్లాన్లు వేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో.. పంజాబ్, కశ్మీర్‌లోని రక్షణ స్థావరాల వద్ద ఆరెంజ్ అలర్ట్‌ ప్రకటించారు.

అయితే ఈ ఆరెంజ్ అలర్ట్ అంటే ప్రకటనతో కాస్త టెన్షన్ తగ్గినట్లు తెలుస్తోంది. ఆరెంజ్ అలర్ట్ అనేది.. హై అలర్ట్ కంటే కాస్త తీవ్రత తక్కువ కలదన్న మాట. పఠాన్‌కోట్, జమ్మూ, శ్రీనగర్, అవంతిపురలలోని రక్షణ శాఖ స్థావరాల వద్ద ఈ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. బుధవారం ఉదయమే ఇంటలిజెన్స్‌ రిపోర్టులు వచ్చాయని, వెంటనే ఈ చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.