రైతాంగ సమస్యలపై ఏకమైన ప్రతిపక్షాలు.. ఇవాళ రాష్ట్రపతితో అఖిపక్షనేతల భేటీ..!

|

Dec 09, 2020 | 9:20 AM

కేంద్ర ప్రభుత్వ తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం మొత్తం ఏకమైంది. అన్నదాతకు అండగా యావత్ భారతావని నిలిచింది. నిన్న నిర్వహించిన భారత్ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దుత పలికాయి.

రైతాంగ సమస్యలపై ఏకమైన ప్రతిపక్షాలు.. ఇవాళ రాష్ట్రపతితో అఖిపక్షనేతల భేటీ..!
Follow us on

కేంద్ర ప్రభుత్వ తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం మొత్తం ఏకమైంది. అన్నదాతకు అండగా యావత్ భారతావని నిలిచింది. నిన్న నిర్వహించిన భారత్ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దుత పలికాయి. రైతుల నిరసనలతో హోరెత్తుతుండటంతో భారత రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. ఈమేరకు మంగళవారం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌, సిపిఎం నేత సీతారాం ఏచూరి చర్చలు జరిపారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు అయిదుగురు సభ్యుల ప్రతినిధు బృందం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలుసుకోనుంది. రాహుల్‌, పవార్‌, ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, డిఎంకె నేత టిఆర్‌ బాలు ఈ ప్రతినిధి వర్గంలో ఉన్నారు. రైతాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్న సాగు చట్టాలను రద్దు చేసేలా రాష్ట్రపతి జోక్యం కోరనున్నట్లు ఏచూరి వెల్లడించారు. రైతులకు కనీస మద్దతు ధర లభించకుండా కార్పొరేట సంస్థలకు అనుకూలంగా చట్టాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.