Health Minister: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్‌పై కాల్పులు.. చాతిలోకి దూసుకుపోయిన బుల్లెట్..

|

Jan 29, 2023 | 1:16 PM

జార్సుగూడ బ్రజరాజ్‌నగర్‌లో ఆరోగ్య మంత్రి నబా దాస్‌పై కాల్పులు జరిగాయి. ఆరోగ్య మంత్రి ఛాతీలోకి బుల్లెట్లు దూసుకుపోయినట్లుగా సమాచారం.

Health Minister: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్‌పై కాల్పులు.. చాతిలోకి దూసుకుపోయిన బుల్లెట్..
Health Minister Naba Das
Follow us on

ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్‌దాస్‌పై దుండగులు కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో గాయపడ్డ నవకిశోర్‌దాస్‌ను ఆస్పత్రికి తరలించారు. ఝూర్సిగూడ భ్రజరాజ్‌నగర్‌లో ఓ కార్యక్రమానికి వెళ్లిన నవకిశోర్‌దాస్‌పై కాల్పులు జరిపారు. కారు దిగగానే ఆయనపై సమీపం నుంచి కాల్పులు జరిపినట్లుగా సమాచారం. ఆరోగ్య మంత్రి నవదాస్ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆ ఘటన జరిగింది. మంత్రి నవదాస్‌ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా జనంలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఆయన సొంత నియోజకవర్గంలోనే జరగడం మరింత సంచలనంగా మారింది. బ్రిజ్‌రాజ్‌నగర్ గాంధీ వీధిలో కాల్పులు జరిగింది. ఈ ఘటనా స్థలంలో ఐదు రౌండ్లు కాల్పులు జరిపగా.. ఒక రౌండ్ మంత్రి శరీరానికి తగిలింది. మంత్రి నబా దాస్‌ను  రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. ఒక బుల్లెట్ నేరుగా ఛాతీలోకి దూసుకెళ్లింది. పరిస్థితి విషమంగా ఉండగా.. జార్సుగూడలో విమానాశ్రయం ఉండటంతో.. మంత్రిని విమానంలో మరో రాష్ట్రానికి తరలించినట్లు సమాచారం.

అయితే ఈ ఘటన తర్వాత రాష్ట్రమంతా గందరగోళంగా మారింది. ఘటనా స్థలంలో మద్దతుదారుల ఆందోళనకు దిగారు. అదేవిధంగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏఎస్సై గోపాల్ దాస్ ఆరోగ్య మంత్రి నవదాస్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే పోలీసులు ఏఎస్సై గోపాల్ దాస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసు ఏఎస్‌ఐ గోపాల్‌దాస్‌ పేరుతో రైఫిల్‌ను విడుదల చేయడంతో అతను తన సొంత రైఫిల్‌తో కాల్చినట్లు సమాచారం.

అయితే షూటింగ్ తర్వాత అనేక ఊహాగానాలు వచ్చాయి. రాజకీయాలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చునని ఊహాగానాలు వచ్చాయి. ఏఎస్సై గోపాల్ దాస్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో.. ఏఎస్సై గోపాల్ దాస్ వ్యక్తిగత పగతో ఉండొచ్చని చెబుతున్నారు.

ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే.. భద్రతా బలగాలను ఛేదించి.. నబాదాస్ ఎస్కార్ట్ వద్దకు దుండగుడు ఎలా చేరుకున్నాడు అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న ప్రతి సాక్షి ప్రకారం, దుండగులు అత్యంత సమీపం నుండి కాల్చి చంపబడ్డారు.  దుండుగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన తరువాత బీజేడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం