Viral: సింహాన్ని కాటేసిన అత్యంత ప్రమాదకర విషసర్పం.. వెంటనే అలర్టైన డాక్టర్లు.. చివరకు

|

May 28, 2022 | 5:35 PM

ఓ ఎన్​క్లోజర్​లో ఉన్న ఆడసింహం గంగను.. శుక్రవారం కోబ్రా జాతికి చెందిన ఓ విషసర్పం కాటేసినట్లు అధికారులు తెలిపారు. ఆ పామును గుర్తించిన వెంటనే.. సింహానికి విరుగుడు ఇంజక్షన్స్ ఇచ్చారు. కానీ...

Viral: సింహాన్ని కాటేసిన అత్యంత ప్రమాదకర విషసర్పం..  వెంటనే అలర్టైన డాక్టర్లు.. చివరకు
Lioness Dies
Follow us on

ఒడిశా భువనేశ్వర్​లోని నందన్​కనన్​ జూ పార్క్​లో విషాదం చోటుచేసుకుంది. ఓ పాము(Common krait) కాటేయడంతో 15 ఏళ్ల వయసున్న ఆఫ్రికన్ ఆడసింహం చనిపోయింది. శనివారం ఈ ఘటన జరిగింది. 2015లో ఇజ్రాయెల్ నుంచి ఈ సింహాన్ని తీసుకొచ్చారు. చనిపోయిన సింహం పేరు గంగ. గంగ శుక్రవారం రోజు సడెన్‌గా అస్వస్థతకు గురైంది. దీంతో వైద్యులు దానికి చికిత్స చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి సింహానికి సమీపంలోని ఓ వాటర్​ ట్యాంక్​ వద్ద కామన్ క్రైట్ పాము ముడుచుకొని కనిపించడంతో, అదే కాటేసి ఉండవచ్చని అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో వెంటనే వైద్యులు దానికి 3 యాంటీ-వెనమ్‌ ఇంజక్షన్స్ ఇచ్చారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. చికిత్సకు స్పందించని గంగ శనివారం మృతి చెందింది. వైద్యులు తీవ్రంగా శ్రమించినా ప్రాణాలు దక్కలేదని జూ సిబ్బంది వెల్లడించారు. సింహం మరణానికి అసలు కారణం పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే తెలుస్తుందని పేర్కొన్నారు.

సింహాన్ని కాటేసిన పాము ఇదే

 

ఇదిలా ఉంటే, గంగ మరణంతో జూలో సింహాల సంఖ్య 16కి తగ్గింది. జూలో ఆఫ్రికన్ సింహాల సంఖ్యను పెంచేందుకు 2015లో ఇజ్రాయెల్ నుంచి నాలుగు సింహాలను నందన్‌కనన్‌కు తీసుకువచ్చారు. అయితే, వాటిలో 2 సింహాలు..  2018 ఆగస్టులో మరణించాయి. తాజాగా గంగ మరణంలో జూలో ఆఫ్రికల్ సింహాల సంఖ్య 1కి పడిపోయింది. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి