బిట్‌కాయిన్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆర్‌బీఐదే తుది నిర్ణయం..!

|

Mar 15, 2021 | 3:33 PM

క్రిప్టోకరెన్సీకి సంబంధించి బిట్ కాయిన్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. భారతదేశంలో బిట్‌కాయిన్ లావాదేవీలను నిలిపివేయడం లేదని ఆమె స్పష్టం చేశారు.

బిట్‌కాయిన్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆర్‌బీఐదే తుది నిర్ణయం..!
Finance Minister Nirmala Sitharaman On Cryptocurrency
Follow us on

Cryptocurrency  : క్రిప్టోకరెన్సీకి సంబంధించి బిట్ కాయిన్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. భారతదేశంలో బిట్‌కాయిన్ లావాదేవీలను నిలిపివేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే దీనిపై తుది నిర్ణయం ఆర్‌బీఐదేనని తేల్చి చెప్పారు.

బిట్‌కాయిన్ ధరలు ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా, ఈ క్రిప్టోకరెన్సీ కొత్త రికార్డులను సొంతం చేసుకుంటుంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత నోట్ కరెన్సీతో సమానంగా దీనిపై నిరంతరం చర్చలు జరుపుతోంది. ఈ కరెన్సీ గురించి ఆర్‌బిఐ, ప్రభుత్వం కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. కానీ భారతదేశంలో దీనిని నిషేధిస్తున్నారనే ఊహాగానాలకు నిర్మల సీతారామన్ తెరదించారు.

ఒక సమావేశంలో ప్రసంగిస్తూ, ఈ కరెన్సీని నిషేధించడం గురించి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను అడిగినప్పుడు, ప్రస్తుతం, క్రిప్టోకరెన్సీ, ఫిన్‌టెక్‌కు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె వెల్లడించారు. త్వరలోనే బ్లాక్‌చెయిన్, బిట్‌కాయిన్లు, క్రిప్టోకరెన్సీలతో ప్రయోగాలు చేయడానికి ప్రజలకు తగిన అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.

నిర్మలా సీతారామన్ బిట్‌కాయిన్‌తో సహా క్రిప్టోకరెన్సీ గురించి కేంద్ర మంత్రి మండలి దీనిపై ఓ ముసాయిదాను సిద్ధం చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఇంకా బిట్‌కాయిన్‌ లావాదేవీలకు సంబంధించి ఎవిథంగానూ ఆపలేదని నిర్మల సీతారామన్ చెప్పారు. కేబినెట్ ముసాయిదాను సిద్ధం చేసిన తర్వాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందన్నారు.

క్రిప్టోకరెన్సీపై తుది నిర్ణయం రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటుందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ సమస్యకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. అనధికార క్రిప్టోకరెన్సీని ఎలా ఆమోదించాలో దానిని ఎలా నియంత్రించాలో రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తోందన్నారు. ఈ విషయంలో ప్రతి రకమైన ప్రయోగానికి మేము సిద్ధంగా ఉన్నామని మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

అయితే, బిట్‌కాయిన్‌ను ఆపే తుది నిర్ణయం ఆర్‌బిఐకి ఉంటుందని ప్రభుత్వం ఖచ్చితంగా చెబుతోంది. ఆర్‌బీఐ తన డిజిటల్ కరెన్సీని తీసుకురావాలని ఇంతకు ముందే ఫ్లాన్ చేసింది. ఈ ఏడాది జనవరి 25 న ఆర్‌బీఐ విడుదల చేసిన బుక్‌లెట్‌లో, క్రిప్టోకరెన్సీపై ప్రభుత్వం జాగ్రత్తగా ఉందని, దానితో వచ్చే ప్రమాదం ఏమిలేదని తెలిపింది. క్రిప్టోకరెన్సీ అనేది వికేంద్రీకృత చెల్లింపు వ్యవస్థ. సాంప్రదాయ కరెన్సీ వంటి ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా ఇది నియంత్రించలేదు. ఈ కారణంగా, ఆర్‌బీఐ వంటి కేంద్ర బ్యాంకులకు ఇది ఆందోళన కలిగించే విషయం. ఆర్‌బిఐ మాదిరిగానే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా క్రిప్టోకరెన్సీకి వ్యతిరేకంగా హెచ్చరించింది.

Read Also… 

AIIMS Recruitment: నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. జీతం రూ. లక్ష మొదలు రెండు లక్షల వరకు.. దరఖాస్తు చేసుకోండిలా..