“ఇండియా”కు బదులుగా “భారత్‌” అని కానీ “హిందుస్థాన్‌” అని కానీ మార్చాల్సిందే..!

| Edited By:

May 29, 2020 | 6:34 PM

మన దేశం పేరును ఇండియా అని కాకుండా.. భారత్‌, హిందుస్థాన్‌ అని మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ సుప్రీంకోర్టులో జూన్‌ 2వ తేదీన విచారణకు రానుంది. మన దేశాన్ని ఇండియా అని కాకుండా.. భారత్‌ లేదా హిందుస్థాన్‌ అని పిలిస్తే.. గర్వ కారణంగా ఉంటుందని.. అంతేకాకుండా.. అలా పిలవడం ద్వారా ఆత్మాభిమానంగా ఉంటుందని పిటిషనర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఇందుకుగాను.. రాజ్యాంగ సవరణ చేపట్టి.. ఇండియాకు బదులుగా.. ఇక నుంచి భారత్‌ లేదా హిందుస్థాన్‌ అని పెట్టాలంటూ […]

ఇండియాకు బదులుగా భారత్‌ అని కానీ హిందుస్థాన్‌ అని కానీ మార్చాల్సిందే..!
Follow us on

మన దేశం పేరును ఇండియా అని కాకుండా.. భారత్‌, హిందుస్థాన్‌ అని మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ సుప్రీంకోర్టులో జూన్‌ 2వ తేదీన విచారణకు రానుంది. మన దేశాన్ని ఇండియా అని కాకుండా.. భారత్‌ లేదా హిందుస్థాన్‌ అని పిలిస్తే.. గర్వ కారణంగా ఉంటుందని.. అంతేకాకుండా.. అలా పిలవడం ద్వారా ఆత్మాభిమానంగా ఉంటుందని పిటిషనర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఇందుకుగాను.. రాజ్యాంగ సవరణ చేపట్టి.. ఇండియాకు బదులుగా.. ఇక నుంచి భారత్‌ లేదా హిందుస్థాన్‌ అని పెట్టాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పేరు మార్పు గురించి.. కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును పిటిషన్‌లో కోరారు. అయితే ఈ పిటిషన్‌పై.. శుక్రవారం నాడే విచారణ జరగాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అందుబాటులో లేకపోవడంతో.. ఇవాళ జరగాల్సిన విచారణ..జూన్ 2కు వాయిదా పడింది.