అనిల్ దేశ్ ముఖ్ ని మార్చే ప్రసక్తే లేదు. మహారాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ స్పష్టీకరణ

| Edited By: Anil kumar poka

Mar 21, 2021 | 12:21 PM

తమ రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ని మార్చే ప్రసక్తే లేదని మహారాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ ప్రకటించారు. అనిల్ దేశ్ ముఖ్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్..

అనిల్ దేశ్ ముఖ్ ని మార్చే ప్రసక్తే లేదు. మహారాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ స్పష్టీకరణ
No Question Of Replacing Anil Deshmukh Says Maharashtra Minister Jayant Patil
Follow us on

తమ రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ని మార్చే ప్రసక్తే లేదని మహారాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ ప్రకటించారు. అనిల్ దేశ్ ముఖ్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్.. సీఎం ఉద్దవ్ థాక్రేకి లేఖ రాసిన లేఖ నేపథ్యంలో కఠిన వైఖరి చేపట్టాలని స్వయంగా ముఖ్యమంత్రి, అనిల్ కూడా నిర్ణయించుకున్నారని, అందువల్లే ఈ ప్రకటన చేస్తున్నానని రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు కూడా అయిన జయంత్ పాటిల్ చెప్పారు. ఈ ఆరోపణలు రుజువు కావాల్సి ఉందన్న తరహాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు . పరమ్ బీర్ సింగ్ తన లేఖలో.. అనిల్ దేశ్ ముఖ్ అవినీతి గురించి ఎన్సీపీలోని కొందరు నేతలకు కూడా తెలుసునని పేర్కొన్నారు. దీంతో ఎన్సీపీలో కూడా మెల్లగా దుమారం మొదలైంది.   పరమ్  బీర్  సింగ్ ని హోమ్ గార్డ్స్ విభాగానికి బదిలీ చేసిన విషయాన్ని జయంత్ పాటిల్ ప్రస్తావిస్తూ.. ఒక ఆరోపణ చేసేముందు మొదట దానిలోని నిజానిజాలను గుర్తించాలని అన్నారు. తనను బదిలీ చేయకముందు సింగ్ ఈ ఆరోపణలు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

ముకేశ్ అంబానీ ఇంటివద్ద వాహనంలో జిలెటిన్ స్టిక్స్ ని కనుగొనడం, ఈ  ఉదంతంతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే ని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో.. .. అనిల్ దేశ్ ముఖ్ తనకు 100 కోట్ల టార్గెట్ పెట్టారంటూ సచిన్ వాజే నాతో చెప్పారని  సింగ్ తన లేఖలో పేర్కొన్న అంశాలు రాజకీయ ప్రకంపనలు   రేపాయి.  అనిల్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. అయితే ఈ ఆరోపణలు నిరాధారాలని అనిల్ కొట్టి పారేశారు. తనను ఈ కేసు నుంచి రక్షించుకునేందుకే సింగ్ ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని, తాను ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన చెప్పారు. ఇలా ఉండగా ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఎన్సీపీ నేతలు సమావేశమవవుతున్నారు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :కూల్ డ్రింక్స్ లో పాము పిల్ల..భయపెడుతున్న వీడియో..!:Snake found in cooldrink bottle Video

మార్స్ పై నీటిజాడ..గురించి సంచలన నిజాలు వెల్లడించిన నాసా : water on Mars Video
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్నేక్ ఐలాండ్ వీడియో…ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలు : Snake Island Video