మోదీతో ఉద్దవ్ భేటీ.. కాంగ్రెస్‌కు భారీ షాక్ ఇచ్చిన శివసేన.. ఏం జరిగిందంటే..?

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 6:14 PM

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే.. కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఢిల్లీ టూర్‌లో ఉన్న ఉద్దవ్.. శుక్రవారం ప్రధాని మోదీని కలిశారు. సీఎం హోదాలో తొలిసారిగా హస్తినలో పర్యటించిన ఆయన.. కుమారుడు ఆదిత్య థాక్రేతో కలిసి ప్రధానితో సమావేశం అయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌర పట్టిక (NRC), జాతీయ జనాభా పట్టిక (NPR) గురించి ఈ భేటీలో చర్చించారు. సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు కేంద్రానికి మద్దతిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉద్దవ్ థాక్రే.. సీఏఏ వల్ల […]

మోదీతో ఉద్దవ్ భేటీ.. కాంగ్రెస్‌కు భారీ షాక్ ఇచ్చిన శివసేన.. ఏం జరిగిందంటే..?
Follow us on

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే.. కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఢిల్లీ టూర్‌లో ఉన్న ఉద్దవ్.. శుక్రవారం ప్రధాని మోదీని కలిశారు. సీఎం హోదాలో తొలిసారిగా హస్తినలో పర్యటించిన ఆయన.. కుమారుడు ఆదిత్య థాక్రేతో కలిసి ప్రధానితో సమావేశం అయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌర పట్టిక (NRC), జాతీయ జనాభా పట్టిక (NPR) గురించి ఈ భేటీలో చర్చించారు.

సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు కేంద్రానికి మద్దతిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉద్దవ్ థాక్రే.. సీఏఏ వల్ల మహారాష్ట్రలో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగబోదన్నారు. త్వరలో మహారాష్ట్రలో ఎన్‌పీఆర్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. సీఏఏ గురించి దేశంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. NPR వల్ల దేశం నుంచి ఎవరూ బయటికి గెంటివేయబడరని తెలిపారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని ఉద్దవ్ థాక్రే అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. మోదీ, ఉద్ధవ్ థాక్రే భేటీ చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు మహారాష్ట్రలో శివసేన కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తులో ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే సీఏఏని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నా.. శివసేన మాత్రం మద్దతు తెల్పుతున్నట్లు స్పష్టం చేయడం.. అంతేకాకుండా రాష్ట్రంలో అమలు చేస్తానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.