హర్యానా అసెంబ్లీలో రేపు సీఎం ఖట్టర్ ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం,

| Edited By: Anil kumar poka

Mar 09, 2021 | 8:19 PM

హర్యానాలో సీఎం మనోహర్ లాల్ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బుధవారం అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది; దీంతో పాలక బీజేపీ-జన నాయక్ జనతా పార్టీ...

హర్యానా అసెంబ్లీలో రేపు సీఎం ఖట్టర్ ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం,
Follow us on

హర్యానాలో సీఎం మనోహర్ లాల్ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బుధవారం అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది; దీంతో పాలక బీజేపీ-జన నాయక్ జనతా పార్టీ తమ సభ్యులందరికీ తప్పనిసరిగా సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది. హర్యానా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, విపక్ష నేత భూపేందర్ సింగ్ హుడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. 23 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన ఈ తీర్మానాన్ని స్పీకర్  జ్ఞాన్ చంద్ గుప్తా ఆమోదించారు. పాలక కూటమికి మద్దతు ఇఛ్చిన ఇద్దరు స్వతంత్ర సభ్యులు తమ సపోర్టును ఉపసంహరించుకున్నారని భూపేందర్ సింగ్ హుడా తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజల, ఎమ్మెల్యేల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన చెప్పారు. ఇది అవినీతికర ప్రభుత్వమని పలువురు ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారని ఆయన అన్నారు.

90 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ లో బీజేపీ నుంచి 40 మంది, జెజేపీ నుంచి 10 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా స్వతంత్ర సభ్యులు చాలామంది ఉన్నారు. వారి మద్దతుతో తమ అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని విపక్ష కాంగ్రెస్ భావిస్తుండగా.. వారు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని పాలక కూటమి భావిస్తోంది. లోగడ రైతుల ఆందోళన సందర్భంగా తాము ప్రభుత్వానికిమద్దతు ఉపసంహరించుకుంటామని ఒక సందర్భంలో జన నాయక్ జనతాపార్టీ హెచ్ఛరించింది. అయితే ఖట్టర్, ఇతర నేతలు బుజ్జగించడంతో ఆ ప్రతి[పాదనను ఉపసంహరించుకుంది.

మరిన్ని చదవండి ఇక్కడ :

శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిధిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ : Sreekaram Pre Release Event Chief Guest KTR Live Video

‘చావు కబురు చల్లగా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేయనున్న బన్నీ:Chaavu Kaburu Challaga Pre Release Event LIVE Video