UP Lelctions: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఒంటరిగానే పోటీ చేస్తుంది: పార్టీ ప్రధాన కార్యదర్శి త్యాగి

|

Jan 28, 2021 | 12:19 AM

UP Lelctions: వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయు) ఒంటరిగానే పోటీ చేస్తుందని మిత్ర పక్షమైన బీజేపీతో పోత్తులు..

UP Lelctions: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఒంటరిగానే పోటీ చేస్తుంది: పార్టీ ప్రధాన కార్యదర్శి త్యాగి
Follow us on

UP Lelctions: వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయు) ఒంటరిగానే పోటీ చేస్తుందని, మిత్ర పక్షమైన బీజేపీతో పోత్తులు ఉండవని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి అన్నారు. ఈ నిర్ణయం బీహార్‌లో చోటు చేసుకోబోయే పరిణామాలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. 2022లో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని జేడీయూ జాతీయ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని అన్నారు.

2017లో యూపీలో పోటీ చేయలేదని, దీంతో పార్టీకి నష్టం వాటిల్లిందని అన్నారు. యూపీ, బీహార్‌తో ముడిపడి ఉన్న రాష్ట్రమని అన్నారు. యూపీ, బీహర్‌తో ముడిపడి ఉన్న రాష్ట్రమని, అక్కడ మా ప్రభుత్వ విధానాలు బాగా ప్రచారం జరిగాన్నారు. ఉత్తరప్రదేశ్‌ ఒంటరి పోరు నిర్ణయంపై బీహార్‌లో రాజకీయ పరిణామాలకు సంబంధం లేదన్నారు. ఇదిలా ఉండగా, అక్టోబర్‌, నవంబర్‌లో ఎన్నికలు జరిగిన రెండు నెలల కంటే తక్కువ సమయంలో జేబీయూ అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మినహా అందరూ బీజేపీలో చేరిపోయారు.

Prime Minister: భార‌తీయ జ‌నౌష‌ధి ప‌రియోజ‌న‌పై పీఎం స‌మీక్ష‌… తెలంగాణ ప్రాజెక్టుల పురోగ‌తిపై ప్ర‌శంస‌…