వరంగల్‌ నిట్‌ విద్యార్థుల స‌త్తా..14 మందికి ఊహించని ప్యాకేజీ !

|

Apr 28, 2020 | 2:35 PM

తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ నిట్ విద్యార్థులు స‌త్తా చాటారు. వ‌రంగ‌ల్ నిట్ విద్యార్థులు క్యాంప‌స్ ప్లేస్‌మెంట్ల‌లో అద‌ర‌గొట్టారు.

వరంగల్‌ నిట్‌ విద్యార్థుల స‌త్తా..14 మందికి ఊహించని ప్యాకేజీ !
Follow us on
తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ నిట్ విద్యార్థులు స‌త్తా చాటారు. వ‌రంగ‌ల్ నిట్ విద్యార్థులు క్యాంప‌స్ ప్లేస్‌మెంట్ల‌లో అద‌ర‌గొట్టారు. వీళ్ల టాలెంట్ చూసి క్యాంప‌స్ సెల‌క్ష‌న్ల కోసం వ‌చ్చిన ప‌లు కంపెనీలు ఫిదా అయ్యాయి. టాలెంట్ ప్ర‌ద‌ర్శించిన విద్యార్థుల‌కు అత్య‌ధిక ప్యాకేజీతో ఎంపీక చేసుకున్నాయి.  ప్ర‌స్తుత విద్యా సంవ‌త్స‌రంలో 73 మంది విద్యార్థుల‌ను 177 కంపెనీలు ఉద్యోగుల కోసం ఎంపిక చేసుకున్నాయి. వీరిలో 14 మంది విద్యార్థులు అత్య‌ధికంగా రూ. 43.33ల‌క్ష‌ల వార్షిక ప్యాకేజీతో ఎంపిక కావ‌డం విశేషం. విద్యార్థులు సాధించిన ఘ‌న‌త‌కు వారి త‌ల్లిదండ్రులు సంతోషం వ్య‌క్తం చేశారు.
వ‌రంగ‌ల్ నిట్‌లో చదువుతున్న విద్యార్థులు 90 శాతం మంది అత్య‌త్తుమ స్థానాల‌లో  కొలువులకు ఎంపికవుతున్నట్లు అధ్యాపకులు తెలిపారు. ఐదేళ్లుగా ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, పెప్సీకో తదితర కంపెనీలలో ఏడాదికి రూ.50 నుంచి 65 లక్షల ప్యాకేజీలతో విద్యార్థులు కొలువులకు ఎంపికవుతున్నార‌ని స్ప‌ష్టం చేశారు. కంప్యూటర్‌సైన్స్‌, ఈసీఈ, మెకానికల్‌, ఈఈఈ, సివిల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల విద్యార్థులు రూ.10 లక్షల కంటే అధిక ప్యాకేజీలతో 90 శాతానికి పైగా ప్రాంగణ ఎంపికల్లో కొలువులు దక్కించుకుంటున్నారు. వ‌రంగ‌ల్ నిట్ విద్యార్థులు ప్ర‌పంచ‌దేశాల‌తో పోటీ ప‌డుతున్నందుకు అధ్యాప‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.