సభలో నిర్మలమ్మ కశ్మీరీ ‘కవిత’.. వారెవ్వా!

| Edited By:

Feb 01, 2020 | 1:55 PM

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కశ్మీరీకి సంబంధించిన ఒక కవితను చదివి వినిపిచడం విశేషం. ‘నా దేశం దాల్‌ సరస్సులో విరబూసిన కమలం.. మానవత్వం, దయతో కూడిన సమాజం అవసరం.. నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం.. మా దేశం వికసిస్తున్న షాలిమార్‌ పూలవనం’ అంటూ ఆవిడ వినిపించడంతో.. సభ్యులంతా హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు. ప్రధాని మోదీ చిరునవ్వుతో ఈ కవితను ఆలకించారు. కాగా.. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ […]

సభలో నిర్మలమ్మ కశ్మీరీ కవిత.. వారెవ్వా!
Follow us on

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కశ్మీరీకి సంబంధించిన ఒక కవితను చదివి వినిపిచడం విశేషం. ‘నా దేశం దాల్‌ సరస్సులో విరబూసిన కమలం.. మానవత్వం, దయతో కూడిన సమాజం అవసరం.. నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం.. మా దేశం వికసిస్తున్న షాలిమార్‌ పూలవనం’ అంటూ ఆవిడ వినిపించడంతో.. సభ్యులంతా హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు. ప్రధాని మోదీ చిరునవ్వుతో ఈ కవితను ఆలకించారు.

కాగా.. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండో సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాన మంత్రి గృహ ఆవాస యోజన పథకంతో దేశ వ్యాప్తంగా ప్రజలకు గృహ వసతి లభించిందన్నారు. కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులుగా మారినట్లు ఆమె తెలిపారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినట్లు చెప్పినట్లు ఆమె.. ఈ బడ్జెట్ సామాన్య ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటుందని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ పదాన్ని పదేపదే ప్రస్థావించిన నిర్మలా.. మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలను గుర్తు చేశారు.