డిజిటల్ ఇండియాకే పెద్ద పీట!

| Edited By:

Feb 01, 2020 | 1:58 PM

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా.. డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతోన్న కారణంగా.. దేశవ్యాప్తంగా డిజిటల్ ఇండియాకే పెట్ట పీట వేశామన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిన కారణంగా.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఆవాసం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకూ 40 కోట్ల మందికి జీఎస్టీ రిటర్నల్‌ దాఖలు చేశారని ఆమె పేర్కొన్నారు. కాగా మూడు లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. మొదటిది న్యూ ఇండియా, రెండొవది సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, మూడొవది […]

డిజిటల్ ఇండియాకే పెద్ద పీట!
Follow us on

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా.. డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతోన్న కారణంగా.. దేశవ్యాప్తంగా డిజిటల్ ఇండియాకే పెట్ట పీట వేశామన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిన కారణంగా.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఆవాసం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకూ 40 కోట్ల మందికి జీఎస్టీ రిటర్నల్‌ దాఖలు చేశారని ఆమె పేర్కొన్నారు. కాగా మూడు లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. మొదటిది న్యూ ఇండియా, రెండొవది సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, మూడొవది ప్రజా సంక్షేమమని నిర్మాలా సీతారామన్ పేర్కొన్నారు.

ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండో సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జీడీపీతో ప్రభుత్వ రుణభారం తగ్గిందని చెప్పుకొచ్చారు. గతేడాది మార్చిలో ఇది 48.7 శాతం తగ్గిందన్నారు. ప్రధాన మంత్రి గృహ ఆవాస యోజన పథకంతో దేశ వ్యాప్తంగా ప్రజలకు గృహ వసతి లభించిందన్నారు. కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులుగా మారినట్లు ఆమె తెలిపారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినట్లు చెప్పినట్లు ఆమె.. ఈ బడ్జెట్ సామాన్య ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటుందని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ పదాన్ని పదేపదే ప్రస్థావించిన నిర్మలా.. మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలను గుర్తు చేశారు.