వారి వల్లే ఇదంతా.. మన్మోహన్‌, రాజన్‌లపై నిర్మల సంచలన ఆరోపణలు

| Edited By:

Oct 17, 2019 | 10:47 AM

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వల్లనే ప్రభుత్వ రంగ బ్యాంకులు దీన స్థితికి చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ఆరోపణలు చేశారు. యుపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణాల ఎగ్గొట్టిన వారి సంఖ్య భారీ స్థాయిలో ఉందని ఆమె విమర్శించారు. రాజన్ హయాంలో ఫోన్ కాల్ ద్వారానే కార్పోరేట్ కంపెనీలకు వేల కోట్లు రుణాలు ఇచ్చారని నిర్మలా ఆరోపించారు. కొలంబియా […]

వారి వల్లే ఇదంతా.. మన్మోహన్‌, రాజన్‌లపై నిర్మల సంచలన ఆరోపణలు
Follow us on

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వల్లనే ప్రభుత్వ రంగ బ్యాంకులు దీన స్థితికి చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ఆరోపణలు చేశారు. యుపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణాల ఎగ్గొట్టిన వారి సంఖ్య భారీ స్థాయిలో ఉందని ఆమె విమర్శించారు. రాజన్ హయాంలో ఫోన్ కాల్ ద్వారానే కార్పోరేట్ కంపెనీలకు వేల కోట్లు రుణాలు ఇచ్చారని నిర్మలా ఆరోపించారు. కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్‌ కార్యక్రమంలో ఆమె ప్రసగింస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు తిరిగి ప్రాణవాయువు అందించడమే తమ ముందున్న కర్తవ్యమని ఆమె స్పష్టం చేశారు.

బ్రౌన్ వర్సిటీలో రాజన్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పించడాన్ని ప్రస్తావించిన నిర్మలా.. ఆయన హయాంలో జరిగిన బ్యాంక్ రుణాల జారీలో సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఆయన చెబుతున్న ప్రతి మాట ఆయనకే వర్తిస్తుందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఉత్తేజంగా ఉన్న సమయంలో కేంద్ర బ్యాంక్ సారథ్య బాధ్యతలు చేపట్టిన రాజన్‌ను తాను గొప్ప మేథావిగానే గౌరవిస్తానని నిర్మలా ఈ సందర్భంగా పేర్కొన్నారు.