Nirbhaya Case: కాసేపట్లో తీర్పు.. అంతలోనే టెన్షన్..!

| Edited By:

Feb 14, 2020 | 4:02 PM

Nirbhaya Case verdict: నిర్భయ దోషులకు విడిగా ఉరిశిక్ష అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వబోతోంది. అయితే అంతలోనే అత్యున్నత న్యాయస్థానంలో టెన్షన్ నెలకొంది. తీర్పు చదివే సమయంలో జస్టిస్ భానుమతి స్పృహ తప్పి పడిపోయారు. జ్వరం ఉండటంతో ఆమె కళ్లు తిరిగి కిందపడ్డారు. దీంతో తీర్పును కాసేపటికి వాయిదా వేశారు. కాగా ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే మరోవైపు తనకు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడాన్ని […]

Nirbhaya Case: కాసేపట్లో తీర్పు.. అంతలోనే టెన్షన్..!
Follow us on

Nirbhaya Case verdict: నిర్భయ దోషులకు విడిగా ఉరిశిక్ష అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వబోతోంది. అయితే అంతలోనే అత్యున్నత న్యాయస్థానంలో టెన్షన్ నెలకొంది. తీర్పు చదివే సమయంలో జస్టిస్ భానుమతి స్పృహ తప్పి పడిపోయారు. జ్వరం ఉండటంతో ఆమె కళ్లు తిరిగి కిందపడ్డారు. దీంతో తీర్పును కాసేపటికి వాయిదా వేశారు. కాగా ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే మరోవైపు తనకు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దోషి వినయ్ శర్మ వేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టి వేసిన విషయం తెలిసిందే.

Also Read: vinay petition rejected in supreme