Nirbhaya Convicts Hanging: మానవ మృగాలను ఉరి తీశారిలా..!

| Edited By:

Mar 20, 2020 | 7:09 AM

కొన్నేళ్లుగా యావత్ భారతదేశం ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో దారుణ హత్యాచారానికి గురైన నిర్భయ కేసు దోషులకు ఎట్టకేలకు ఉరి పడింది.

Nirbhaya Convicts Hanging: మానవ మృగాలను ఉరి తీశారిలా..!
Follow us on

కొన్నేళ్లుగా యావత్ భారతదేశం ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో దారుణ హత్యాచారానికి గురైన నిర్భయ కేసు దోషులకు ఎట్టకేలకు ఉరి పడింది. ఉరిని తప్పించుకునేందుకు దోషులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ.. న్యాయదేవత మాత్రం వారి పప్పులు ఉడగకుండా చేశారు. ఈ కేసులో దోషులైన పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, ముఖేష్ సింగ్‌కు తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పవన్ జలాద్ అనే తలారి వారిని ఉరి తీశారు. నిర్భయ ఘటన జరిగి 7 ఏళ్ల తరువాత ఉరి శిక్షను అమలు చేశారు.

తెల్లవారు జామున గం.4ల.కు ముందే దోషులను నిద్ర లేపిన జైలు అధికారులు.. రోజు వారి దినచర్యలు ముగిసిన తరువాత వారికి అల్పాహారం అందించారు. ఆ తరువాత డాక్టర్లు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. అనంతరం ఒక్కో దోషి వెంట 12 మంది జైలు గార్డులు వెంటరాగా.. ఉరికంభం వద్దకు నడిపించారు. న్యాయమూర్తి , వైద్యులు, జైలు సిబ్బంది సమక్షంలో జైలు నంబర్ 3 దగ్గర అనుకున్న సమయానికే వారిని ఉరి తీశారు. 30నిమిషాల తరువాత వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

Read This Story Also: నిర్భయ దోషులకు ఉరి అమలు…