ఢిల్లీ సర్కార్‌కు మానవహక్కుల కమిషన్ షాక్

| Edited By: Srinu

Dec 09, 2019 | 7:05 PM

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. అంటారు కదా.. సరిగ్గా ఇలాగే జరిగింది ఢిల్లీ నగరంలో. ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది చనిపోయిన ఉదంతం ఢిల్లీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. ఢిల్లీ అనాజ్ మండి అగ్నిప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, నగర పోలీస్ కమిషనర్‌కు, ఎన్.డి.ఎమ్.సి కమిషనర్‌కు,కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా అగ్నిప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని […]

ఢిల్లీ సర్కార్‌కు మానవహక్కుల కమిషన్ షాక్
Follow us on

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. అంటారు కదా.. సరిగ్గా ఇలాగే జరిగింది ఢిల్లీ నగరంలో. ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది చనిపోయిన ఉదంతం ఢిల్లీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. ఢిల్లీ అనాజ్ మండి అగ్నిప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, నగర పోలీస్ కమిషనర్‌కు, ఎన్.డి.ఎమ్.సి కమిషనర్‌కు,కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా అగ్నిప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది జాతీయ మానవ హక్కుల కమిషన్.

అగ్నిప్రమాదానికి కారకులైన అధికారులపై తీసుకున్న చర్యలు, భాదితులకు పునరావాస, ఉపశమన చర్యలను నివేదికలో తెలపాలని ఆదేశాలు జారీ చేసింది కమిషన్. నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. నిపుణుల కమిటి ఢిల్లీ మాస్టర్ ప్లాన్‌పై అధ్యయనం చేయాలని అభిప్రాయపడింది కమిషన్. ఆదివారం అనాజ్ మండిలోని భవనంలో జరిగిన అగ్నిప్రమాదం‌లో 43 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మీడియా కథనాలను ఆధారం చేసుకుని జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది.