వ్యాక్సిన్లకు నిధుల కొరత లేదు….కేంద్రం స్పష్టీకరణ…

| Edited By: Anil kumar poka

Jun 08, 2021 | 6:24 PM

కొత్త వ్యాక్సినేషన్ ప్లాన్ అమలుకు సుమారు 50 వేలకోట్లు వ్యయమవుతాయని ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వం వద్ద తగినంత సొమ్ము ఉందని, దీనిపై కంగారు పడవలసిన అవసరం లేదని పేర్కొన్నాయి.

వ్యాక్సిన్లకు నిధుల కొరత లేదు....కేంద్రం స్పష్టీకరణ...
Vaccination
Follow us on

కొత్త వ్యాక్సినేషన్ ప్లాన్ అమలుకు సుమారు 50 వేలకోట్లు వ్యయమవుతాయని ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వం వద్ద తగినంత సొమ్ము ఉందని, దీనిపై కంగారు పడవలసిన అవసరం లేదని పేర్కొన్నాయి. ఈ కారణంగా వెంటనే అనుబంధ పద్దులకు వెళ్లాల్సిన ఆవశ్యకత లేదని, బహుశా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇందుకు పూనుకోవచ్చునని వెల్లడించాయి. ప్రస్తుతానికి డబ్బుకు కొరత లేదని, ఇదే సమయంలో వ్యాక్సిన్ అవసరాలకు ప్రభుత్వం విదేశీ వ్యాక్సిన్లపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడలేదని ఈ శాఖ వర్గాలు చూచాయగా పేర్కొన్నాయి. భారత్ బయో టెక్, సీరం సంస్థతో బాటు కొత్త కంపెనీ అయిన బయో-ఈ నుంచి కూడా తగినంత వ్యాక్సిన్ ని సేకరించగలమన్న విశ్వాసాన్ని ఆర్థిక శాఖ వ్యక్తం చేసింది. ఫైజర్, మోడెర్నా కంపెనీలతో చర్చలు ప్రస్తుతానికి నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఇండియాలో ఈ సంస్థల టీకామందులకు సంబంధించి వివాదాలు ఉండగా..అమెరికాలోని కోర్టుల్లోనూ కొన్ని నలుగుతున్నాయని సమాచారం. ఏమైనా వచ్చే ఏడాది జనవరి వరకు మోడెర్నా వ్యాక్సిన్ ఇండియాకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

దేశంలో వినియోగానికి కోవీషీల్డ్, కొవాగ్జిన్ టీకామందులకు అనుమతి ఉన్నా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రొక్యూర్ మెంట్ విషయంలో ఇంకా ఇందుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభం కాలేదు. హైదరాబాద్ లోని బయోలాజికల్-ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ ఇంకా క్లినికల్ ట్రయల్ దశలో లో ఉంది. కానీ గతవారమే ప్రభుత్వం తమకు 30 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరమని బుక్ చేసుకుందట…ఈ కంపెనీకి ఆర్ధిక శాఖ అడ్వాన్సుగా 1500 కోట్లను చెల్లించనుందని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Y. S. Vivekananda Reddy : వివేకానంద హత్య కేసుపై సీబీఐ విచారణ పునఃప్రారంభం..కడపకు చేరుకున్న సీబీఐ అధికారులు

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష..కరోనాకు ఉచితంగా చికిత్స చెయ్యాలి అంటూ డిమాండ్ :Telangana Congress video.

 భూమిపై దర్శనమిచ్చిన భారీ స్విమ్మింగ్ ఫూల్ ..!చూస్తుండగానే అంతకంతకు పెద్దదిగా మారుతుంది..:viral vieo.

నాట్యం చేస్తున్న నెమలి చుస్తే వావ్ అనాల్సిందే..వైరల్ అవుతున్న వీడియో : Peacock viral video