జిత్తులుమారిలా కరోనా.. పేరెంట్స్.. బికేర్ ఫుల్

|

Aug 27, 2020 | 2:17 PM

మహమ్మారి కరోనా జిత్తులుమారిలా తయారైంది. కాలక్రమంలో కొత్తపోకడలకు పోతూ ప్రజల ఉసురు తీసేందుకు ఉపక్రమిస్తోంది. 14 రోజుల పాటు కాదు..

జిత్తులుమారిలా కరోనా.. పేరెంట్స్.. బికేర్ ఫుల్
Corona affect on kids
Follow us on

మహమ్మారి కరోనా జిత్తులుమారిలా తయారైంది. కాలక్రమంలో కొత్తపోకడలకు పోతూ ప్రజల ఉసురు తీసేందుకు ఉపక్రమిస్తోంది. 14 రోజుల పాటు కాదు.. నెలల తరబడి నేనున్నానంటోంది. కొంత మంది చిన్నారుల్లో మూడు, నాలుగు వారాల తర్వాత సైతం తీవ్ర ప్రభావిన్ని చూపిస్తోంది. కొందరి పిల్లల్లో కొవిడ్ వైరస్ తొలి పద్నాలుగు రోజల్లో పెద్దగా ప్రభావం చూపించకపోయినా 3, 4 వారాల్లో తీవ్రమవుతోందని..ఇది తాజాగా వస్తున్న కేసుల్లో కనిపిస్తుందని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. మొదటి రెండు వారాల్లో లక్షణాలు పెద్దగా బయటపడకపోవడంతో పిల్లలు కరోనా బారిన పడిన విషయాన్ని తల్లిదండ్రులు కూడా గుర్తించలేకపోతున్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఆ తర్వాత తీవ్ర జ్వరం, ఒళ్లంతా దద్దుర్లు, కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులను పరిశీలిస్తే కొవిడ్ కు అనుబంధంగా ఉత్పన్నమవుతున్న తీవ్ర సమస్యగా నిర్ధారణ అవుతుందని డాక్టర్లు అంటున్నారు. ఇదే తరహా కేసులు గత నెల రోజుల్లో ఒక్క గాంధీ ఆస్పత్రికే 26 వచ్చాయని గాంధీ వైద్యులు అంటున్నారు. సో.. తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త.