థాక్రే పామంటా..! చూడండి అదేంటో..!

| Edited By:

Sep 27, 2019 | 8:24 AM

శాస్త్రవేత్తలు.. ఎవరు ఎది తయారు చేస్తే.. వారి ఇష్టమున్న పేరు పెట్టుకుంటారు. అయితే కొందరు కొత్త ప్రదేశాలను కనుగొన్నప్పుడు కూడా వారికి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుని ఓ గుర్తింపు పొందుతారు. అయితే మహారాష్ట్రలో ఓ కొత్త రకం పాము జాతిని కనిపెట్టారు. అది కనిపెట్టింది ఎవరో కాదు.. శివసేనా చీఫ్ ఉద్దవ్ థాక్రే కుమారుడు తేజస్ థాక్రే. దీంతో శాస్త్రవేత్తలు ఆ కొత్త రకం పాముకు థాక్రే పేరుతో వచ్చేలా.. థాక్రేస్ క్యాట్ స్నేక్ గా […]

థాక్రే పామంటా..! చూడండి అదేంటో..!
Follow us on

శాస్త్రవేత్తలు.. ఎవరు ఎది తయారు చేస్తే.. వారి ఇష్టమున్న పేరు పెట్టుకుంటారు. అయితే కొందరు కొత్త ప్రదేశాలను కనుగొన్నప్పుడు కూడా వారికి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుని ఓ గుర్తింపు పొందుతారు. అయితే మహారాష్ట్రలో ఓ కొత్త రకం పాము జాతిని కనిపెట్టారు. అది కనిపెట్టింది ఎవరో కాదు.. శివసేనా చీఫ్ ఉద్దవ్ థాక్రే కుమారుడు తేజస్ థాక్రే. దీంతో శాస్త్రవేత్తలు ఆ కొత్త రకం పాముకు థాక్రే పేరుతో వచ్చేలా.. థాక్రేస్ క్యాట్ స్నేక్ గా నామకరణం చేశారు. “బోయిగా థాకేరయి” అని సైంటిఫిక్ ‌నేమ్ పెట్టారు. ఈ పాము జాతిని కనిపెట్టడంలో తేజస్‌ చేసిన కృషి వల్ల ఈ పేరు పెట్టినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. తేజస్‌ ఠాక్రే 2015లో మొట్టమొదటిసారిగా ఈ జాతి పామును చూశారు. అనంతరం ఈ పాముపై ప్రత్యేక అధ్యయనం చేసి.. ఆ వివరాలన్నింటినీ జీవ వైవిధ్య సంరక్షణ సంస్థకు అప్పగించారు. అయితే ఈ పాము గురించి వారు కూడా అధ్యయనం చేస్తున్నారు. “ఈ పాము ఎక్కువగా అటవీ పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇది రాత్రి వేళల్లో చురుకుగా ఉంటుంది. అయితే ఇదేం విష పూరితమైనది కాదు. ఇది మూడు అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఇది నైక్టిబాట్రాచుషుమాయుని అనే కప్ప యొక్క గుడ్లను తింటుందని పేర్కొన్నారు.