అన్నదాతకు తీపికబురు..త్వరలో రైతు ఖాతాల్లోకి రూ.2,000!

|

Jul 09, 2020 | 3:22 PM

అన్నదాతను ఆదుకోవాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా గతేడాది ఫిబ్రవరి నెలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను ఆవిష్కరించింది. రైతులకు..

అన్నదాతకు తీపికబురు..త్వరలో రైతు ఖాతాల్లోకి రూ.2,000!
Follow us on

అన్నదాతను ఆదుకోవాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా గతేడాది ఫిబ్రవరి నెలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను ఆవిష్కరించింది. రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసింది. ఈ పథకం కింద కేంద్రం అర్హులైన రైతులకు ఏడాదికి 3 విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6,000 అందిస్తోంది.

పీఎం కిసాన్ స్కీమ్‌ ఆరో విడత నిధులు త్వరలోనే రైతులకు అందనున్నాయి. ఆగస్ట్ 1 నుంచి అన్నదాతలకు రూ.2,000 డబ్బులు రైతు ఖాతాలో జమకానున్నాయి. ఇకపోతే ఇప్పటికీ కూడా పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరని వారు ఉంటే సులభంగానే ఇంట్లో నుంచే ఈ పథకంలో చేరొచ్చు. దీని కోసం మీ వద్ద మీ పొలం వివరాలు, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ సమాచారం ఉంటే సరిపోతుంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీరే పథకంలో చేరొచ్చు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 10 కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేకూరుతున్నట్లుగా తెలుస్తోంది.