కర్ణాటకలో కీలక బిల్లుకు ఆమోదం.. ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరం.. అసెంబ్లీలో రచ్చ రచ్చ..

|

Dec 10, 2020 | 5:34 AM

కర్ణాటక రాష్ట్ర శాసనసభలో కీలక బిల్లుకు ఆమోదం లభించింది. గవర్నర్ ఆమోదం పొందడమే తరువాయి.. ఆ బిల్లు చట్టంగా..

కర్ణాటకలో కీలక బిల్లుకు ఆమోదం.. ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరం.. అసెంబ్లీలో రచ్చ రచ్చ..
Follow us on

కర్ణాటక రాష్ట్ర శాసనసభలో కీలక బిల్లుకు ఆమోదం లభించింది. గవర్నర్ ఆమోదం పొందడమే తరువాయి.. ఆ బిల్లు చట్టంగా మారనుంది. ఇంతకీ ఏంటా బిల్లు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలో గోవధను నిషేధించాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో దానికి సంబంధించిన గోవధ నిషేధం, గో సంరక్షణ ముసాయిదా బిల్లు-2020 ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రతిపక్ష సభ్యుల తీవ్ర ఆందోళనల మధ్యే బిల్లును ఆమోదింపజేసుకుంది. ఈ బిల్లు చట్టం రూపంగా మారినట్లయితే రాష్ట్రంలో ఎవరైనా గోవధకు పాల్పడినట్లైతే కఠిన చర్యలు తీసుకోనున్నారు. అయితే ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ క్రమంలో సభలో పెద్ద గందరగోళమే జరిగింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. బిల్లుపై చర్చ జరగకుండా ఎలా ఆమోదిస్తారంటూ ధ్వజమెత్తారు. అసలు అజెండాలోనే లేని బిల్లును సభలో ప్రవేశపెట్టడం.. పైగా దానిని ఏకపక్షంగా ఆమోదించుకోవడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ప్రతిపక్ష నాయకులంతా యడ్యూరప్ప ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ తీరుకు నిసనగా ప్రతిపక్ష నాయకులు సభ నుంచి వాకౌట్ చేశారు.