జవాన్లకు రక్షణగా.. బాలిస్టిక్ హెల్మెట్లు..

| Edited By:

Jul 17, 2020 | 6:23 AM

నిత్యం బార్డర్‌లో గస్తీ చేపడుతున్న సైన్యానికి రక్షణను పెంచేందుకు భారత సైన్యం మరింత ముందడుగు వేసింది. ముఖ్యంగా ఉగ్రవాదులు, తీవ్రవాదులతో ఎదురుకాల్పులు చేపడుతున్న సమయంలో తలకు బుల్లెట్..

జవాన్లకు రక్షణగా.. బాలిస్టిక్ హెల్మెట్లు..
Follow us on

నిత్యం బార్డర్‌లో గస్తీ చేపడుతున్న సైన్యానికి రక్షణను పెంచేందుకు భారత సైన్యం మరింత ముందడుగు వేసింది. ముఖ్యంగా ఉగ్రవాదులు, తీవ్రవాదులతో ఎదురుకాల్పులు చేపడుతున్న సమయంలో తలకు బుల్లెట్ తగలడం ద్వారా అనేక మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక నుంచి ఇలా ప్రమాదాల బారినపడుకుండా.. ఏకే-47 బుల్లెట్ల నుంచి కూడా తలకు రక్షణగా ఉండేందుకు హెల్మెట్లను కొనగోలు చేసేందుకు రెడీ అయ్యింది. దేశీయ‌, ప్రపంచ హెల్మెట్ తయారీదారులకు.. జూన్ 23 న సైన్యం ఈ బాలిస్టిక్ హెల్మట్లప ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పదాదిదళ డైరెక్టరేట్ సమాచార అభ్యర్థన (ఆర్ఎఫ్ఐ)ను జారీ చేయడం ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభమైంది. జూలై 13వ తేదీన కూడా ఢిల్లీలో పలువురి హెల్మెట్ తయారీదారులతో డైరెక్టరేట్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి.. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో బాలిస్టిక్ హెల్మెట్‌ల ప్రతిపాదనల కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపింది. ఒక్కో హెల్మెట్‌కు దాదాపు.. రూ.50 వేల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి. భారత ఆర్మీ రూ.500 కోట్ల వ్యయంతో బాలిస్టిక్‌ హెల్మెట్స్‌ ఆర్డర్ ఇవ్వనున్నట్లు సమాచారం.