New Bacteria in Kerala: హడలెత్తిస్తున్న కొత్త బ్యాక్టీరియా.. కేరళలో బాలుడు మృతి.. జాగ్రత్త అంటూ వైద్యుల వార్నింగ్..!

|

Dec 20, 2020 | 7:20 AM

ఇప్పటికే కరోనా కారణంగా యావత్ భారతదేశం అల్లాడిపోతుంటే.. మరో కొత్త ముప్పు ముంచుకొస్తోంది. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో కొత్తగా

New Bacteria in Kerala: హడలెత్తిస్తున్న కొత్త బ్యాక్టీరియా.. కేరళలో బాలుడు మృతి.. జాగ్రత్త అంటూ వైద్యుల వార్నింగ్..!
Follow us on

New Bacteria in Kerala: ఇప్పటికే కరోనా కారణంగా యావత్ భారతదేశం అల్లాడిపోతుంటే.. మరో కొత్త ముప్పు ముంచుకొస్తోంది. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో కొత్తగా ప్రాణాంతక బ్యాక్టీరియా వెలుగు చూసింది. ఈ బ్యాక్టీరియాను ‘షిగెల్లా’ గా పిలుస్తున్నారు. అయితే, ఈ బ్యాక్టీరియా కారరణంగా ఇన్‌ఫెక్షన్‌కు గురైన 11 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. అంతేకాదు.. అతనితో సన్నిహితంగా మెలిగిన వారు కూడా అస్వస్థత బారిన పడ్డారని వైద్యులు వెల్లడించారు. బాధిత బాలుడితో కలిసిమెలిసి ఉన్న దాదాపు 20 మంది జ్వరం, అతిసారం, కడుపులో తిప్పడం వంటి ఇతర సమస్యలతో ఆస్పత్రుల్లో చేరినట్లు కోజికోడ్ అధికారులు తెలిపారు. వీరి అనారోగ్యానికి బ్యాక్టీరియానే కారణమని వైద్యులు తేల్చిన నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతి చెందిన బాలుడు స్వగ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన అందరికీ పరీక్షలు జరుపుతామని కేరళ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి శైలజ ప్రకటించారు. కొత్త బ్యాక్టీరియా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

 

Also read:

తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు.. క్రిస్మస్ పండుగకు కొత్త సినిమాలతో..

బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ నిజంగా అనారోగ్యానికి గురయ్యాడా? దీనిపై వస్తున్న వార్తలు నిజమా.. అబద్ధమా..