నేను ఏ పార్టీలో చేరడం లేదు: సంజయ్‌దత్

| Edited By:

Aug 26, 2019 | 7:48 PM

తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవడం లేదన్నారు బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్. రాష్ట్రీయ సమాజ్ పక్ష్(ఆర్ఎస్పీ)లో సంజయ్‌దత్ చేరుతున్నట్టు ఆపార్టీ వ్యవస్థాపకుడు మహాదేవ్ జంకర్ ఆదివారం ప్రకటించిన విషయంపై సంజయ్ వివరణ ఇచ్చారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదన్నారు. ఆర్ఎస్పీ ఛీప్ మహాదేవ్ తనకు మంచి మిత్రుడని ఆయన రాజకీయంగా అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కోరుకుంటానన్నారు. ఆయన రాజకీయాల్లో వస్తున్నారనే వార్త బీ టౌన్‌తో పాటు, రాజకీయ వర్గాల్లో సైతం హల్‌చల్ చేసింది. ఇదిలా […]

నేను ఏ పార్టీలో చేరడం లేదు: సంజయ్‌దత్
Follow us on

తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవడం లేదన్నారు బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్. రాష్ట్రీయ సమాజ్ పక్ష్(ఆర్ఎస్పీ)లో సంజయ్‌దత్ చేరుతున్నట్టు ఆపార్టీ వ్యవస్థాపకుడు మహాదేవ్ జంకర్ ఆదివారం ప్రకటించిన విషయంపై సంజయ్ వివరణ ఇచ్చారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదన్నారు. ఆర్ఎస్పీ ఛీప్ మహాదేవ్ తనకు మంచి మిత్రుడని ఆయన రాజకీయంగా అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కోరుకుంటానన్నారు. ఆయన రాజకీయాల్లో వస్తున్నారనే వార్త బీ టౌన్‌తో పాటు, రాజకీయ వర్గాల్లో సైతం హల్‌చల్ చేసింది.

ఇదిలా ఉంటే మహాదేవ్ జంకర్ ఆర్ఎస్పీ నుంచి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో పశుసంవర్ధక మంత్రిగా ఉన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన మిత్రుడు సంజయ్‌దత్ ప్రచారానికి రానున్నారని, ఆయన సెప్టెంబర్ 25న ఆర్ఎస్పీలో చేరుతున్నట్టు కూడా చెప్పారు. అయితే ఈ వార్తల్ని సంజయ్‌దత్ ఖండించారు.