NEET 2021: నీట్‌ 2021 సిలబస్‌ తగ్గించిందా.? నీట్ పరీక్షా విధానం ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

|

Feb 16, 2021 | 11:36 AM

NEET 2021: దేశవ్యాప్తంగా మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వ‌హించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌) నిర్వహించనుంది. ఈ ప్రవేశానికి అర్హత..

NEET 2021: నీట్‌ 2021 సిలబస్‌ తగ్గించిందా.? నీట్ పరీక్షా విధానం ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
Follow us on

NEET 2021: దేశవ్యాప్తంగా మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వ‌హించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌) నిర్వహించనుంది. ఈ ప్రవేశానికి అర్హత పరీక్ష నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ .. నీట్‌ 2021 దరఖాస్తు చేసుకునేందుకు నీట్‌ 2021 పరీక్షతేదీకి సంబంధించి ఇంకా ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

నీట్‌ 2021 సిలబస్‌ తగ్గించిందా.?

అయితే 2021 బోర్డ్‌ ఎగ్జామ్‌ సిలబస్‌లో తగ్గింపుతో సంబంధం లేకుండా ఎన్‌టీఏ నిర్ణయించిన సిలబస్‌ ప్రకారమే మెడికల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌, నీట్‌ జరుగుతుందని విద్యా మంత్రిత్వశాఖ గతంలోనే స్పష్టం చేసింది. నీట్‌ 2021 దరఖాస్తు ఫారం త్వరలో విడుదల కానుంది. ప్రకటించిన తర్వాత విద్యార్థులు NETవెబ్‌ సైట్‌ ntaneet.nic.in ని NEET 2021 దరఖాస్తు ఫారమ్ తేదీలు, నీట్‌ 2021 పరీక్ష తేదీలను వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

అలాగే నీట్‌ 2021కి అర్హత సాధించాలంటే అభ్యర్థి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్‌లతో గుర్తింపు పొందిన బోర్డు ఆఫ్‌ ఇండియా నుంచి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి అర్హత పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. అలాగే విద్యామంత్రిత్వశాఖ సంవత్సరానికి రెండు సార్లు నీట్‌ను నిర్వహించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అయితే నీట్‌ 2021ను రెండుసార్లు నిర్వహించడం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

నీట్ దరఖాస్తు ఎలా చేయాలి..?

నీట్‌ దరఖాస్తు ప్రక్రియ ఐదు దశలుగా ఉంటాయి. అవి నీట్‌ రిస్ట్రేషన్‌, దరఖాస్తు నింపడం, స్కాన్‌ చేసిన పేపర్లు, మార్కుల సర్టిఫికేట్‌, తర ధృవపత్రాలు, రుసుము చెల్లించడం వంటి పత్రాలు అప్‌లోడ్‌ చేయాలి.

నీట్ పరీక్షా విధానం ఏమిటి?

నీట్‌ పరీక్ష విధానం ప్రకారం.. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ అండ్‌ బయాలజీ (బోటనీ అండ్‌ జువాలాజీ) నుంచి 180 మల్టిపుల్‌ చాయిల్‌ ప్రశ్నలకు మెడికల్‌ ఎంట్రన్స్‌ టెస్టు నిర్వహించడం జరుగుతుంది. నీట్‌ 2021లోని ఫిజిక్స్‌, కెమెస్ట్రీ విభాగాలు ఒక్కొక్కటి 45 మల్టీపుల్‌ చాయిస్‌ ప్రశ్నలతో సమానమైన వెయిటేజీని కలిగి ఉంటాయి. బయాలజీ విభాగం 90 ప్రశ్నలు ఉంటాయి. నీట్‌ 2021 మొత్తం మార్కులు 720. నీట్‌కు అర్హత సాధించడానికి విద్యార్థులకు వయసు పరిమితి 25 ఏళ్లు.

Job News : గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగ అవకాశాలు, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో నియామకాలు