భార‌త్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 24,714 క‌రోనా పాజిటివ్ కేసులు.. నిన్న‌టి క‌న్నా అధికంగా మూడు శాతం పాజి‌టివ్ కేసులు

|

Dec 24, 2020 | 10:59 AM

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10,39,645 మందికి కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా 24,712 మందికి పాజిటివ్ తేలింది. ఇప్పటి వరకు దేశంలో...

భార‌త్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 24,714 క‌రోనా పాజిటివ్ కేసులు.. నిన్న‌టి క‌న్నా అధికంగా మూడు శాతం పాజి‌టివ్ కేసులు
Follow us on

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10,39,645 మందికి కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా 24,712 మందికి పాజిటివ్ తేలింది. ఇప్పటి వరకు దేశంలో 1,01,23,778 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.నిన్న‌టి క‌న్నా మూడు శాతం అధికంగా పాజిటివ్ కేసుల న‌మోద‌య్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో 312 మంది కరోనాతో మరణించగా, ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1,46,756కు చేరుకుంది. తాజాగా కరోనా నుంచి 96,93,173 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 2,83,849 మంది కోలుకున్నారు. అలాగే డిసెంబర్ 1 నుంచి 22 వరకు వారాల వ్యవధిలో మొదటి ఐదు రాష్ట్రాల్లో క్రియాశీలక కేసుల్లో చోటు చేసుకున్న మార్పును కేంద్ర మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. ఆ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ఉండగా, మహారాష్ట్రలో క్రియాశీల కేసుల్లో తగ్గుదల కనిపించింది.

తాజాగా ద‌క్షిణ‌ఫ్రికాలో గుర్తించిన కొత్త‌ర‌కం స్ట్రైయిన్ వైర‌స్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. మ‌రో వైపు అమెరికాలో సుమారు 10 ల‌క్ష‌ల మందికి క‌రోనా టీకా వేశారు. గ‌త కొన్ని రోజులుగా బ్రిట‌న్ నుంచి భార‌త్ కు వ‌చ్చిన వారిలో 22 మందికి క‌ర‌నా పాజిటివ్ ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీలో 11 మంది, అమృత్ స‌ర్‌లో 8 మంది, కోల్‌క‌తాలో ఇద్ద‌రు, చెన్నైలో ఒక‌రు చొప్పున పాజిటివ్ తేలారు.

హైద‌రాబాద్‌: 40 వేల మందికి కరోనా వ్యాక్సిన్.. టీకా పంపిణీకి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఏర్పాట్లు