హైద‌రాబాద్‌: 40 వేల మందికి కరోనా వ్యాక్సిన్.. టీకా పంపిణీకి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఏర్పాట్లు

క‌రోనా మ‌హ‌మ్మారితో ప్ర‌పంచం అత‌లాకుత‌లం అవుతోంది. వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఎలాంటి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. భార‌త్ లో...

హైద‌రాబాద్‌: 40 వేల మందికి కరోనా వ్యాక్సిన్.. టీకా పంపిణీకి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఏర్పాట్లు
Follow us

|

Updated on: Dec 24, 2020 | 8:35 AM

క‌రోనా మ‌హ‌మ్మారితో ప్ర‌పంచం అత‌లాకుత‌లం అవుతోంది. వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఎలాంటి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. భార‌త్ లో కూడా క‌రోనా విజృంభిస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు భార‌త్ తీవ్ర స్థాయిలో శ్ర‌యిస్తోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో వ్యాక్సినేష‌న్‌ను ప్రారంభిస్తున్న‌ట్లు ఇది వ‌ర‌కే కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

ఈ క‌రోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాల‌ను ఎంచుకుంది తెలంగాణ ప్ర‌భుత్వం. ఈ రెండు జిల్లాల్లో టీకా పంపిణీకి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. తొలి విడ‌త‌లో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాలలోని వైద్య సిబ్బందికి, ఐసీడీఎస్ సిబ్బందికి వేయనున్నారు. దీంతో ఈ రెండు జిల్లాల్లో 40,095 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కాగా, మొదటి విడతలో పీహెచ్ సీ స్థాయిలో వ్యాక్సిన్ అందించేందుకు భారీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వ్యాక్సిన్ డోసుల నిల్వకు సరైన వసతులు స‌మ‌కూర్చేందుకు అధికారులు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 65 డీప్ ఫ్రీజర్స్ ఏర్పాట్లు చేసే పని ఉన్నాన‌రు. అలాగే వ్యాక్సిన్ అందించే స‌మ‌యంలో మూడు గదులు ఉన్న భవనం కావాల్సి ఉండ‌గా, సమీపంలోని ఆస్పత్రులు, పాఠశాలలు, సామాజిక భవనాలను ఎంచుకుంటున్నారు అధికారులు.

అయితే ప్రతి కేంద్రంలో 100 మందికి టీకా ఇస్తారు. వ్యాక్సిన్ అందించేందుకు మేడ్చల్ జిల్లాలో 146, రంగారెడ్డి జిల్లాలో 60 కేంద్రాలను గుర్తించారు. అయితే టీకా తీసుకునే వారి సంఖ్యను కుదించాలని ప్ర‌భుత్వం భావిస్తుండ‌గా, అందుకు తగినట్లుగానే మరిన్ని కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానన్నట్లు తెలుస్తోంది. అలాగే వ్యాక్సిన్ వేసేందుకు రంగారెడ్డి జిల్లాలో 6081 ప్రభుత్వ సిబ్బంది కాగా, 19312 మంది ప్రైవేటు సిబ్బందిని గుర్తించారు. అలాగే మేడ్చల్ జిల్లాలో 2159 ప్రభుత్వ సిబ్బంది, 12543 ప్రైవేటు సిబ్బందిని గుర్తించినట్లు తెలుస్తోంది.

అలా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో తెలంగాణ ప్ర‌భుత్వం ముంద‌స్తుగా ఏర్పాట్లు చేసుకుంటోంది. రాష్ట్రంలో గ‌తంలో ప్ర‌తి రోజు పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 2 వేల వ‌ర‌కు న‌మోదు అవుతుండ‌గా, తాజాగా కేసుల సంఖ్య పూర్తిగా త‌గ్గిపోయింది. ప్ర‌స్తుతం ప్ర‌తి రోజు 600లోపు పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డికి తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ చ‌ర్య‌లు చేప‌ట్ట‌గా, కొంత కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఇక వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే టీకా వేసేందుకు ముంద‌స్తుగానే ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..