కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

| Edited By:

Jul 31, 2020 | 12:04 PM

ఉత్తరాఖండ్‌లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి కాలువలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. వరదల ప్రభావంతో ఎన్నో రహదారులు కొట్టుకుపోయాయి. ఇక కొండచరియలు రహదారులపై..

కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
Follow us on

ఉత్తరాఖండ్‌లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి కాలువలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. వరదల ప్రభావంతో ఎన్నో రహదారులు కొట్టుకుపోయాయి. ఇక కొండచరియలు రహదారులపై విరిగిపడుతుండటంతో.. అనేక మార్గాలు మూసుకుపోయాయి. ఈ క్రమంలో వరద పరిస్థితులను తెలుసుకోవడానికి పితోర్‌గర్‌ జిల్లాలోని ధర్చులా ఎమ్మెల్యే హరీష్‌ ధామి అటుగా వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ఓ నదిని దాటుతుండగా.. కాలు జారి ఆ నది ప్రవాహంలో పడిపోయారు. అయితే వెంటనే అతడితో పాటు ఉన్న కార్యకర్తలు అతడిని పట్టుకుని కాపాడారు. లుమ్తి, మెరికా గ్రామాల్లో పర్యటించి తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వరద ప్రభావం పెరగడంతోనే ఈ ప్రమాదం జరిగింది. కాలికి స్వల్పగాయాలైనట్లు ఎమ్మెల్యే సహాయకులు తెలిపారు.

Read More 

తైవాన్‌ మాజీ అధ్యక్షుడు ఇక లేరు