సీఎం టు పీఎం.. ప్రజాసేవలో 25 సంవత్సరాలు.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..
PM Modi Viksit Bharat Sankalp Sabha

సీఎం టు పీఎం.. ప్రజాసేవలో 25 సంవత్సరాలు.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

Updated on: Oct 07, 2026 | 10:28 AM

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రధానమంత్రి వరకు సాగిన నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ సభ, సేవా సంకల్ప్‌ జ్యోతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌ 17న ప్రారంభమైన దేశవ్యాప్త సేవా సంకల్ప్‌ యాత్రకు ఇవ్వాల్టితో ముగింపు కార్యక్రమాలు జరగనున్నాయి.

ప్రజాసేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.. సీఎం నుంచి ప్రధానమంత్రి వరకు సాగిన ఈ 25 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్ప్ సభలో కీలక ప్రసంగం చేస్తున్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో సేవా సంకల్ప్‌ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల సేవా సంకల్ప యాత్రికులు హాజరయ్యారు. పాలసీ మేకర్‌గా పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న మోదీ.. బుధవారం ఢిల్లీలోని సరోజినీదేవీ నగర్‌లో గణేశ మందిరానికి వెళ్లి పూజలు చేశారు. మందిరంలోని సిద్ధి, బుద్ధి సమేత గణేషుడితోపాటు హరిహరులకు ప్రత్యేక పూజలు చేశారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఆయన అందించిన సేవలకు గుర్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ సభను ఉద్దేశించి మోదీ ప్రసంగించిన.. అనంతరం’వికసిత్ భారత్ @ 2047 లక్ష్య సాధన కోసం అందరితో కలిసి సామూహిక ప్రతిజ్ఞ చేయిస్తారు. ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే, రాష్ట్రవ్యాప్తంగా నేతలు సేవా జ్యోత్ వెలిగించిసేవా జ్యోతి కలశ యాత్రను ప్రారంభిస్తారు.

సెప్టెంబర్ 17న ప్రారంభమైన దేశవ్యాప్త సేవా సంకల్ప్ యాత్ర కూడా నేటితో ముగియనుంది. ప్రధాని మోదీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వాద్‌నగర్, ఆయన రాజకీయ క్షేత్రమైన ఉత్తరప్రదేశ్‌ వారణాసిలో ముగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us