సిక్కు వ్యక్తి అంత్యక్రియలు చేసి.. మానవత్వం చాటుకున్న ముస్లింలు..!

| Edited By:

May 17, 2020 | 4:53 PM

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చాలా చేటు చేస్తుంది. దీని వలన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

సిక్కు వ్యక్తి అంత్యక్రియలు చేసి.. మానవత్వం చాటుకున్న ముస్లింలు..!
Follow us on

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చాలా చేటు చేస్తుంది. దీని వలన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా మంది వలస కార్మికులు వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్నారు. వారిలో కొంతమంది మరణించగా.. అంత్యక్రియలు కూడా అక్కడే జరిగిపోతున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లో ఓ సిక్కు వ్యక్తి అంత్యక్రియలను ముస్లింలు చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.

పంజాబ్‌కు చెందిన రణ్‌వీర్ సింగ్ అనే వ్యక్తి జమ్ముకశ్మీర్‌లోని వకుర ప్రాంతంలో కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతడు మరణించాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపిన స్థానికులు అంత్యక్రియలను చేసేందుకు ముందుకొచ్చారు. తలా కొంత డబ్బును వేసి పోగుచేసి, రణ్‌వీర్ సింగ్ అంత్యక్రియలను చేశారు. అంతేకాదు కొంత డబ్బును అతడి భార్య అకౌంట్‌లో వేసినట్లు వకుల తహశీల్దార్ గులాబ్‌ మొహమ్మద్ భట్ తెలిపారు.

దీనిపై అబ్దుల్ రహమాన్ అనే స్థానికుడు మాట్లాడుతూ.. మతాలకు అతీతంగా పరులకు సేవ చేయడం మన కర్తవ్యం. చాలా రాష్ట్రాల వారు వచ్చి పనులను చేసుకుంటుంటారు. వారికి మా తరఫున చేయగలిగేంత సాయం చేస్తాం. సింగ్ మరణవార్త విన్న తరువాత, ఆయన అంత్యక్రియలు చేసేందుకు ముందుకొచ్చి, వాటిని పూర్తి చేశాం అని అన్నారు.

Read This Story Also: అక్కడి వారు మాస్క్‌లు వాడాల్సిన అవసరం లేదు: చైనా కొత్త మార్గదర్శకాలు