హనుమాన్ ఆలయ నిర్మాణానికి ముస్లిం భూదానం.. దైవకార్యానికి మతం అడ్డుకాదంటున్న బాషా

|

Dec 09, 2020 | 7:51 AM

దాతృత్వానికి కుల మతాలు అడ్డురావని నిరూపించాడు ఓ ముస్లిం పెద్దాయన.. హిందూ ఆలయానికి సొంత భూమిని విరాళంగా ఇచ్చి మ‌త‌సామ‌ర‌స్యాన్ని చాటుకున్నారు.

హనుమాన్ ఆలయ నిర్మాణానికి ముస్లిం భూదానం.. దైవకార్యానికి మతం అడ్డుకాదంటున్న బాషా
Follow us on

దాతృత్వానికి కుల మతాలు అడ్డురావని నిరూపించాడు ఓ ముస్లిం పెద్దాయన.. హిందూ ఆలయానికి సొంత భూమిని విరాళంగా ఇచ్చి మ‌త‌సామ‌ర‌స్యాన్ని చాటుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శిథిలావస్థకు చేరుకున్న ఓ హనుమాన్ ఆలయ నిర్మాణానికి క‌ర్ణాట‌క‌లోని క‌డుగోడి గ్రామానికి చెందిన హెచ్ఎంజీ బాషా త‌న భూమిని విరాళంగా ఇచ్చారు. దైవకార్యానికి మతం అడ్డుకాదని తెలియజేశాడు. ప్ర‌స్తుత‌మున్న హ‌నుమాన్ ఆల‌యంలో పూజ‌లు చేసుకునేందుకు భ‌క్తులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. భ‌క్తుల బాధ‌ల‌ను చూసిన తాను.. త‌న భూమిని ఆల‌యానికి విరాళంగా ఇచ్చేందుకు నిర్ణ‌యించుకున్నాన‌ని బాషా తెలిపారు. హ‌నుమాన్ ఆల‌య నిర్మాణానికి బాషా మ‌న‌స్ఫూర్తిగా త‌న భూమిని విరాళంగా ఇచ్చార‌ని ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త బైరి గౌడ తెలిపారు. ఆల‌య నిర్మాణ ప‌నులు కొన‌సాగుతున్నాయ‌ని, ముస్లిం వ్య‌క్తి హ‌నుమాన్ టెంపుల్‌కు భూమి విరాళంగా ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.