చైనా వస్తువుల్ని బహిష్కరించాలంటూ ఫత్వా జారీ..

| Edited By:

Jun 21, 2020 | 2:54 PM

దేశ వ్యాప్తంగా డ్రాగన్ కంట్రీపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. మొన్న దిష్టిబొమ్మల దహనం జరిగితే.. నిన్న చైనా వస్తువుల్ని పగులగొట్టారు. అంతేకాదు..

చైనా వస్తువుల్ని బహిష్కరించాలంటూ ఫత్వా జారీ..
Follow us on

దేశ వ్యాప్తంగా డ్రాగన్ కంట్రీపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. మొన్న దిష్టిబొమ్మల దహనం జరిగితే.. నిన్న చైనా వస్తువుల్ని పగులగొట్టారు. అంతేకాదు.. పలు వ్యాపార సంస్థలు చైనా వస్తువులను ఇక అమ్మేది లేదంటూ శపథం చేశారు. ఇదిలావుంటే తాజాగా యూపీలో ఓ ముస్లిం సంస్థ చైనా వస్తువులను బహిష్కరించాలంటూ ఏకంగా ఓ ఫత్వానే జారీచేసింది. రాష్ట్రంలోని బరేలీకి చెందిన ఆల్‌ ఇండియా టాంజీమ్‌ ఉలేమా-ఈ-ఇస్లాం అనే ఓ సంస్థ చైనా వస్తువులు బహిష్కరించాలని ఫత్వా జారీచేసింది. ప్రస్తుతం చైనా, భారత్‌ మధ్య నెలకొన్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా నిల్చునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ సభ్యులు తెలిపారు. భారత భూభాగంలోకి చొరబడి.. మన భారత జవాన్లను చైనా చపండాన్ని ఫత్వాలో ఖండించారు. ఇకపై అంతా చైనాకు చెందిన వస్తువులన్నింటిని కొనకుండా.. బహిష్కరించాలని.. మన ద్వారా చైనా ఆర్ధికంగా లాభపడుతుందని.. ఇలా వస్తు బహిష్కరణ చేయడం ద్వారా.. చైనాకు ఆర్ధికంగా ఇబ్బందులు పెట్టవచ్చని పేర్కొన్నారు.