ఢిల్లీ బిల్లును అడ్డుకోవడానికి ఢిల్లీకి హుటాహుటిన ఎంపీలంతా కదలాలి, టీఎంసీ నేత డెరెక్ ఓ

| Edited By: Anil kumar poka

Mar 24, 2021 | 12:48 PM

ఢిల్లీపై  కేంద్రం పట్టు సాధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ అధికారాలను తగ్గించడానికి ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ ఆమోదించకుండా  విపక్ష ఎంపీలంతా హుటాహుటిన ఢిల్లీ చేరుకోవాలని...

ఢిల్లీ బిల్లును అడ్డుకోవడానికి ఢిల్లీకి హుటాహుటిన ఎంపీలంతా కదలాలి, టీఎంసీ నేత డెరెక్ ఓ
Mp's Are Airdashing To Delhi To Stop Bulldozing Of Delhi To Stop Bulldozing Of Delhi Bill Says Tmc Mp Derek O'brien
Follow us on

ఢిల్లీపై  కేంద్రం పట్టు సాధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ అధికారాలను తగ్గించడానికి ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ ఆమోదించకుండా  విపక్ష ఎంపీలంతా హుటాహుటిన ఢిల్లీ చేరుకోవాలని తృణమూల్  కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ పిలుపునిచ్చారు. ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్  క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2021 ను లోక్ సభ ఆమోదించింది. ఇది ముఖ్యమంత్రికి కాక … ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు విస్తృత అధికారాలను కల్పించడానికి ఉద్దేశించినది. నగరంలో ఎన్నికైన ప్రభుత్వానికన్నా గవర్నర్ కే ఈ బిల్లు ఎక్కువ అధికారాలను కలిస్తోందని, దీనివల్ల సీఎం నామమాత్రమే అవుతారని నిపుణులు పేర్కొంటున్నారు. బెంగాల్ లోను, ఇతర రాష్ట్రాల్లోనూ జరగనున్న ఎన్నికలు ముగిసేవరకు ఈ బిల్లుపై చర్చ జరపకుండా  నిలువరించాలని డెరెక్  ఓబ్రీన్.. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి తూట్లు పొడిచే కత్తి లాంటి బిల్లు అని ఆయన అభివర్ణించారు.  మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుందని, ఈ సమయంలో ఈ బిల్లును రాజ్యసభలో విపక్ష ఎంపీలు ముఖ్యంగా తమ పార్టీ సభ్యులు  అడ్డుకోజాలరని ఆయన పేర్కొన్నారు.  దీన్ని హడావుడిగా ఆమోదిస్తే అది మొత్తం ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

ఈ బిల్లుపై చర్చ చేపట్టినప్పుడు ప్రతి సభ్యునికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. కాగా- ఈ బిల్లుపై నిన్న పార్లమెంట్ లో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే.. దీనివల్ల ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం అన్ని అధికారాలనూ కోల్పోతుందని అన్నారు. ఇది ప్రమాదకరమైనదని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందని, లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో ముఖ్యమంత్రి ఓ ‘సర్వెంట్’ అవుతాడని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభ ఆమోదించకుండా చూడాలన్నారు. ఇటీవల  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని చట్టం చేస్తే ఇక తామంతా ఎక్కడికి పోవాలని ఆయన ప్రశ్నించారు.
మరిన్ని చదవండి ఇక్కడ :‘నాకు తెలుసు సుశాంత్‌ నువ్వు ఇదంతా చూస్తున్నావని’ నవీన్ పోలిశెట్టి ఎమోషనల్‌ పోస్ట్ : Naveen Polishetty video.

Covid :దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కరాళనృత్యం..మూతపడుతున్న స్కూల్స్.. మాల్స్ రెస్టారెంట్లపై ఆంక్షలు(వీడియో )

సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక ప్రకటన.. తెలంగాణలో రేపట్నుంచి విద్యాసంస్థలు బంద్: Telangana Schools bandh Live Video.