రాజధానిపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్య.. కేంద్రం ఎప్పుడు ఎంటర్ అవుతుందో చెప్పేశారు కూడా…

| Edited By:

Feb 04, 2020 | 6:04 AM

ఏపీ రాజధాని అంశం ఇప్పుడు రాష్ట్రంలో ఎత హాట్‌ టాపిక్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు రాజధానుల అంశంపై అటు అధికార వైసీపీ సై అంటుంటే.. ప్రతిపక్ష టీడీపీ నో అంటోంది. టీడీపీకి మద్దతుగా జనసేన, బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి రాజధాని అంశంపై సంచనల వ్యాఖ్యలు చేశారు. అమరావతి నుంచి రాజధానిని ఒక్క అంగుళం కూడా కదిలించలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. […]

రాజధానిపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్య.. కేంద్రం ఎప్పుడు ఎంటర్ అవుతుందో చెప్పేశారు కూడా...
Follow us on

ఏపీ రాజధాని అంశం ఇప్పుడు రాష్ట్రంలో ఎత హాట్‌ టాపిక్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు రాజధానుల అంశంపై అటు అధికార వైసీపీ సై అంటుంటే.. ప్రతిపక్ష టీడీపీ నో అంటోంది. టీడీపీకి మద్దతుగా జనసేన, బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి రాజధాని అంశంపై సంచనల వ్యాఖ్యలు చేశారు. అమరావతి నుంచి రాజధానిని ఒక్క అంగుళం కూడా కదిలించలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎంటర్ అవుతుందని.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ముందుకెళ్తామన్నారు. అభివృద్ధి పేరుతో కాలయాపన తప్ప సీఎం జగన్ చేసేదేమీ లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలుగుప్పించారు. రాజధాని మార్పుపై.. వేసిన కమిటీలన్నీ.. నెగిటివ్‌ కమిటీలేనని.. అమరావతిపై సీఎం జగన్ పాజిటివ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ సుజనా చౌదరి సూచించారు.