యూపీలో చిరుత హల్‌చల్.. ఇద్దరిపై దాడి..

| Edited By:

Jul 11, 2020 | 10:03 PM

యూపీలో ఓ చిరుత హల్‌చల్ చేసింది. రాష్ట్రంలోని మొరదాబాద్‌ జిల్లాలో ఓ చిరుత పులి తకుర్‌ద్వారా ప్రాంతంలో ఎంటర్‌ అయ్యింది. అంతేకాదు జనావాసంలోకి ప్రవేశించి స్థానిక ప్రజలపై దాడికి దిగింది. దీంతో వెంటనే..

యూపీలో చిరుత హల్‌చల్.. ఇద్దరిపై దాడి..
Follow us on

యూపీలో ఓ చిరుత హల్‌చల్ చేసింది. రాష్ట్రంలోని మొరదాబాద్‌ జిల్లాలో ఓ చిరుత పులి తకుర్‌ద్వారా ప్రాంతంలో ఎంటర్‌ అయ్యింది. అంతేకాదు జనావాసంలోకి ప్రవేశించి స్థానిక ప్రజలపై దాడికి దిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానిక యువత చిరుతపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో చిరుత తీవ్రంగా గాయపడింది. అయితే ప్రజలు దానిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించడంతో వారిపై దాడికి యత్నించింది. అయితే వెంటనే స్థానికులు చిరుత విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు.. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. చాకచక్యంగా బోనులో బంధించి వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన తర్వాత.. దానిని అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు. మరోవైపు చిరుత దాడిలో గాయపడ్డవారిని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారికి పెద్ద ప్రమాదమేమి లేదని వైద్యులు తెలిపారు.

 

Moradabad: 2 people injured after a leopard entered a residential area in Thakurdwara. Leopard also injured by locals. Kanhaiya Patel, District Forest Officer says, “Leopard sent to a veterinary hospital, it is expected to recover. Condition of 2 injured persons not critical.” pic.twitter.com/MMPVP61OSR

— ANI UP (@ANINewsUP) July 11, 2020