తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు

|

May 29, 2020 | 10:02 AM

భానుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగురాష్ట్రాలవారికి హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. జూన్‌ 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వెల్లడించింది. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో ఈ నెల 31న అల్పపీడనం ఏర్పడవచ్చునని తెలిపింది. బంగాళాఖాతంలో తుఫాను సంచారంతో వేగం పుంజుకున్నాయని పేర్కొంది. వాతావరణం అనుకూలిస్తే 6, 7 తేదీలకల్లా రాయలసీమకు నైరుతి విస్తరించే అవకాశం ఉందని ప్రకటించింది. అలాగే రాగల […]

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు
Follow us on

భానుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగురాష్ట్రాలవారికి హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. జూన్‌ 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వెల్లడించింది. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో ఈ నెల 31న అల్పపీడనం ఏర్పడవచ్చునని తెలిపింది. బంగాళాఖాతంలో తుఫాను సంచారంతో వేగం పుంజుకున్నాయని పేర్కొంది. వాతావరణం అనుకూలిస్తే 6, 7 తేదీలకల్లా రాయలసీమకు నైరుతి విస్తరించే అవకాశం ఉందని ప్రకటించింది. అలాగే రాగల 72 గంటల్లో విదర్భ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితలద్రోణి కొనసాగుతోందని తెలిపింది. బలమైన గాలులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.