మహారాష్ట్రలో కలకలం రేపుతున్న పోస్టర్‌.. విషయం ఎంటంటే..?

|

Feb 29, 2020 | 6:59 AM

దేశంలో అక్రమ చొరబాటుదారులను గుర్తించడంతో పాటుగా..పాక్, బంగ్లా, ఆఫ్ఘన్, మయన్మార్‌ల నుంచి వచ్చిన మైనార్టీలను గుర్తించి.. వారికి ఈ దేశ పౌరసత్వాన్ని కల్పించేందుకు సీఏఏ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

మహారాష్ట్రలో కలకలం రేపుతున్న పోస్టర్‌.. విషయం ఎంటంటే..?
Follow us on

దేశంలో అక్రమ చొరబాటుదారులను గుర్తించడంతో పాటుగా..పాక్, బంగ్లా, ఆఫ్ఘన్, మయన్మార్‌ల నుంచి వచ్చిన మైనార్టీలను గుర్తించి.. వారికి ఈ దేశ పౌరసత్వాన్ని కల్పించేందుకు సీఏఏ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్నార్సీని తీసుకొచ్చి.. దేశంలో అక్రమంగా చొరబడ్డ వారిని తిరిగి పంపించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఓ క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన ఓ అడుగు ముందుకేసి.. కీలక ప్రకటన చేసింది. అది కూడా ఏకంగా రాష్ట్రంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మరి. ఎంఎన్ఎస్ అధినేత రాజ్‌థాక్రే ఫోటో పెట్టి.. ఔరంగబాద్‌లో కొన్ని పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రస్తుతం ఇవి రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.

బంగ్లా, పాక్‌లకు చెందిన చొరబాటు దారుల గురించి పక్కా సమాచారం ఇస్తే.. వారికి రూ.5000/- నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై ఎమ్‌ఎన్‌ఎస్‌ విద్యార్థి విభాగం నాయకుడు అఖిల్ చిత్రే స్పందించారు. చొరబాటు దారుల గురించి సమాచారం ఇస్తే.. వారికి రూ.5000/- బహుమతిగా అందిస్తామని.. అలాగే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఇటీవల మహారాష్ట్రలో సీఏఏకి మద్దతుగా ఎమ్ఎన్ఎస్ భారీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఎన్డీఏకి దగ్గరయ్యేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.