కేంద్రం కీలక నిర్ణయం: హెచ్‌ఆర్‌డీ ఇక కేంద్ర విద్యాశాఖ

|

Jul 29, 2020 | 6:04 PM

కేంద్ర మానవ వనరుల అభివ‌ృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్‌ఆర్‌డీ)ను విద్యాశాఖగా మారుస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేంద్రం కీలక నిర్ణయం: హెచ్‌ఆర్‌డీ ఇక కేంద్ర విద్యాశాఖ
Follow us on

కేంద్ర మానవ వనరుల అభివ‌ృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్‌ఆర్‌డీ)ను విద్యాశాఖగా మారుస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రిమండలి ఆమెదం తెలిపింది. అదేవిధంగా నూతన జాతీయ విద్యావిధానానికి కూడా కేబినెట్ ఆమోద ముద్రవేసింది. మానవ వనరుల శాఖ పేరు మార్పు, తదితర వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

ఇకపోతే, పాఠశాల విద్యలో 2022 నాటికి సమూల మార్పులు ప్రవేశపెట్టనున్నామని, అవసరమైన విధివిధానాలను ఎన్‌సిఇఆర్‌టి రూపొందిస్తోందని మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ గతంలోనే ప్రకటించింది. కొత్త జాతీయ విద్యావిధానానికి(ఎన్‌ఇపి)కి తుది రూపం ఇచ్చే ప్రక్రియలో హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ ఉందనీ తెలిపింది. విద్యావిధానాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది.